Share News

KPHB: అనుమానం పెనుభూతమై.. భార్యను హత్య చేసిన భర్త

ABN , Publish Date - Feb 12 , 2025 | 08:35 AM

అనుమానం పెనుభూతమైంది. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో బండరాయితో మోది భార్యను హత్య చేశాడో భర్త. ఈ సంఘటన కూకట్‌పల్లి(Kukatpally)లో జరిగింది.

KPHB: అనుమానం పెనుభూతమై.. భార్యను హత్య చేసిన భర్త

హైదరాబాద్: అనుమానం పెనుభూతమైంది. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో బండరాయితో మోది భార్యను హత్య చేశాడో భర్త. ఈ సంఘటన కూకట్‌పల్లి(Kukatpally)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్‌ రహీం, నస్రీం (25) భార్యాభర్తలు. మూసాపేట్‌ హబీబ్‌నగర్‌(Moosapet Habibnagar)లో రహీం నివాసం ఉంటూ నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్నాడు. నస్రీం ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటోంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కొద్దిగా సమయమిస్తే.. మేమే ఖాళీ చేస్తాం సారూ..


భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదని అనుమానించిన రహీం కొంతకాలంగా ఆమెతో గొడవ పడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఇల్లు కూడా మార్చేందుకు సిద్ధమయ్యాడు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌ పరిధి రాజీవ్‌గాంధీనగర్‌లో అద్దెకు ఇంటిని తీసుకుని మంగళవారం శుభ్రం చేసుకునేందుకు ఇద్దరూ వెళ్లారు. ఆమె ఇల్లు క్లీన్‌ చేసి పడుకోగా.. రహీం బండరాయితో మోది ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే, అతను భయంతో వెంటనే పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

city5.2.jpg


ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి

ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 12 , 2025 | 08:36 AM