Share News

Software employee: గంజాయి స్మగ్లర్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ABN , Publish Date - Jan 28 , 2025 | 10:41 AM

బెంగళూరు(Bengaluru) నుంచి వారం వారం నగరానికి వచ్చి.. కస్టమర్స్‌కు గంజాయి, ఓజీ కుష్‌ (మేలు రకం గంజాయి)ని కస్టమర్స్‌కు సరఫరా చేసి వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ గంజాయి స్మగ్లర్‌(Software Ganja smuggler)ను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు.

Software employee: గంజాయి స్మగ్లర్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

- వారానికోసారి నగరానికి వచ్చి విక్రయాలు

- ఆటకట్టించిన ఎక్సైజ్‌ పోలీసులు

- రూ. 1.91 లక్షల విలువైన సరుకు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: బెంగళూరు(Bengaluru) నుంచి వారం వారం నగరానికి వచ్చి.. కస్టమర్స్‌కు గంజాయి, ఓజీ కుష్‌ (మేలు రకం గంజాయి)ని కస్టమర్స్‌కు సరఫరా చేసి వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ గంజాయి స్మగ్లర్‌(Software Ganja smuggler)ను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద రూ. 1.91 లక్షల ఒక కేజీ పొడి గంజాయి, 175 గ్రాముల ఓజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరికి చెందిన శివరామ్‌ బెంగళూరులోని డెలాయిట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Komatireddy: సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉంటుంది


గంజాయికి అలవాటుపడిన శివరామ్‌, బెంగళూరులో అజయ్‌(Ajay) అనే గంజాయి స్మగ్లర్‌ వద్ద పొడి గంజాయి, ఓజీ గంజాయి కొనుగోలు చేసి బస్సులో బయల్దేరి నగరానికి వస్తాడు. ఇక్కడున్న కస్టమర్స్‌కు గుట్టుగా సరుకును అందజేసి, డబ్బులు వసూలు చేసుకొని తిరిగి బెంగళూరు వెళ్తాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న శంషాబాద్‌(Shamshabad)కు ఎక్సైజ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.


దాంతో శివరామ్‌ బెంగళూరు నుంచి వచ్చి రాయదుర్గం, గచ్చిబౌలి(Rayadurgam, Gachibowli) ప్రాంతాల్లో సరుకును విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా.. బెంగళూరులో ఓజీ గంజాయిని ఒక గ్రాముకు రూ. 1500కు కొనుగోలు చేసి, నగరంలో 3 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు తేలింది. అనంతరం పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.


వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..

ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ

ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 28 , 2025 | 10:41 AM