Hyderabad: లాభాల పేరిట రూ.14 కోట్ల మోసం..
ABN , Publish Date - Mar 05 , 2025 | 08:02 AM
పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తిని సైబరాబాద్ కమిషనరేట్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కందుల శ్రీనివాసరావు (44) వెల్‌విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో 4 రకాల స్కీమ్‌లను ప్రవేశపెట్టి రకరకాల పద్ధతుల్లో డబ్బులను సేకరించాడు.

- 200మంది నుంచి భారీగా వసూళ్లు
- నిందితుడి అరెస్టు
హైదరాబాద్ సిటీ: పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తిని సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) ఆర్థిక నేరాల విభాగం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కందుల శ్రీనివాసరావు (44) వెల్‌విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో 4 రకాల స్కీమ్‌లను ప్రవేశపెట్టి రకరకాల పద్ధతుల్లో డబ్బులను సేకరించాడు.
ఈ వార్తను కూడా చదవండి: High Court: భవన్స్ కళాశాల తీరుపై హైకోర్టు ఆగ్రహం
లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే, రోజు రూ.2వేల చొప్పున 100 రోజుల్లో రూ.2లక్షలు తిరిగిస్తామని, స్కీమ్-2లో లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.20వేల చొప్పున 10నెలల పాటు రూ.2లక్షలు చెల్లిస్తామని చెప్పాడు. స్కీమ్-3లో ఒక వ్యక్తి రూ.6.50లక్షలు డిపాజిట్ చేస్తే 121 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ర్టేషన్ చేస్తామని, ఆ తర్వాత గుడ్‌విల్ రూపంలో పెట్టిన పెట్టుబడిని 20 వాయిదాల్లో రూ.32,500ను చెల్లిస్తామని ప్రకటించాడు.
స్కీమ్-4లో భాగంగా ఒక వ్యక్తి వెల్ విజన్ హోమ్ అప్లియెన్స్ నుంచి టీవీ, వాషింగ్ మెషిన్, ఏసీ(TV, washing machine, AC)లను కొనుగోలు చేస్తే గుడ్‌విల్ రూపంలో 20 వాయిదాల్లో వస్తువుల కొనుగోలుకు వెచ్చించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామంటూ నమ్మించి పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారు. ఇలా సుమారు 200మందికి పైగా ప్రజల నుంచి దాదాపు రూ.14 కోట్లను వసూలు చేశాడు. కొన్ని నెలల పాటు తిరిగి చెల్లింపులు చేసిన శ్రీనివాసరావు ఆ తర్వాత చెల్లింపులు చేయలేదు. దీంతో సుమారు 30మంది బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నిందితుడైన కందుల శ్రీనివాసరావును అరెస్టు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News