Share News

Hyderabad: బాలిక హత్య కేసులో పురోగతి..

ABN , Publish Date - Aug 22 , 2025 | 08:36 AM

కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించినట్లు తెలిసింది. హత్య జరిగి నాలుగురోజులు గడుస్తున్నా.. సరైన ఆధారాలు లేక, బలమైన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ దొరకకపోవడంతో హంతకులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. లా అండ్‌ ఆర్డర్‌, ఎస్‌వోటీ సహా.. 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా నిందితులను గుర్తించలేకపోయారు. అయితే, గురువారం బాలిక తల్లిదండ్రులను విచారించిన పోలీసులకు క్లూ దొరికినట్లు తెలిసింది.

Hyderabad: బాలిక హత్య కేసులో పురోగతి..

- తల్లిదండ్రులను విచారించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: కూకట్‌పల్లి(Kukatpalli)లో జరిగిన బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించినట్లు తెలిసింది. హత్య జరిగి నాలుగురోజులు గడుస్తున్నా.. సరైన ఆధారాలు లేక, బలమైన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ దొరకకపోవడంతో హంతకులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. లా అండ్‌ ఆర్డర్‌, ఎస్‌వోటీ సహా.. 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా నిందితులను గుర్తించలేకపోయారు. అయితే, గురువారం బాలిక తల్లిదండ్రులను విచారించిన పోలీసులకు క్లూ దొరికినట్లు తెలిసింది.


బాలిక అంత్యక్రియలు ముగిసిన తర్వాత తల్లిదండ్రులైన కృష్ణ, రేణుక దంపతులు గురువారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. బాలానగర్‌ డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ ఇతర టీమ్‌లు వారిని అనేక కోణాల్లో విచారించారు. అయితే, ఎవరితోనూ గొడవలు, విభేదాలు లేవని చెప్తూనే పలు విషయాలను పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది.


వారిచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు బాలిక హత్య కేసులో పురోగతి సాధించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే వారు సేకరించిన సమాచారం, తల్లిదండ్రులు చెప్పిన వివరాలు హత్య కేసును ఛేదించడంలో, హంతకున్ని పట్టుకోవడంలో ఎంతవరకు ఉపయోగపడతాయనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా నేడో రేపో బాలిక హత్య కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు

శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక

Read Latest Telangana News and National News

Updated Date - Aug 22 , 2025 | 08:36 AM