Share News

Hi-tech City: పెళ్లైన ఆరునెలలకే నిండు నూరేళ్లు..

ABN , Publish Date - Jun 20 , 2025 | 08:10 AM

అత్తారింటి వేధింపులు తాళలేక పెళ్లైన ఆరునెలలకే ఓ ఇల్లాలు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగుట్టకు చెందిన సుష్మ(27)కు నగరంలోని నేరేడ్‌మెట్‌ ప్రాంతానికి చెందిన అమృత్‌(30)తో వివాహాం జరిగింది.

Hi-tech City: పెళ్లైన ఆరునెలలకే నిండు నూరేళ్లు..

- దుర్గం చెరువులోదూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

- మృతురాలు మూడు నెలల గర్భవతి

- వరకట్న వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు

హైదరాబాద్: అత్తారింటి వేధింపులు తాళలేక పెళ్లైన ఆరునెలలకే ఓ ఇల్లాలు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌(Madhapur Police Station) పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగుట్టకు చెందిన సుష్మ(27)కు నగరంలోని నేరేడ్‌మెట్‌ ప్రాంతానికి చెందిన అమృత్‌(30)తో వివాహాం జరిగింది. ఆ సమయంలో కట్నకానుకల కింద రూ. 5 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు సుష్మ తల్లిదండ్రులు ఇచ్చారు.


వివాహం అనంతరం నేరేడ్‌మెట్‌లోని అత్తారింట్లోనే ఉంటున్నారు. కాగా సుష్మ హైటెక్‌ సిటీ(Hi-tech City)లో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం మూడు నెలల గర్భవతిగా ఉందని తెలుస్తోంది. ఇటీవల అనారోగ్యానికి గురైన సుష్మ తల్లిదండ్రుల వద్దకు వచ్చి చికిత్స తీసుకుంటోంది. విధుల్లో భాగంగా ఎప్పటిలాగే బుధవారం కార్యాలయానికి వెళ్లిన కుమార్తె ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి అంజయ్య గురువారం తెల్లవారుజామున మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


city3.2.jpg

ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని గాలింపుచర్యలు మొద లుపెట్టారు. అయితే ఉదయం 7గంటల ప్రాంతంలో దుర్గం చెరువులో ఓ యువతి శవం తేలినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా మృతదేహం సుష్మదిగా గుర్తించారు. సుష్మ మృతికి అత్తింటి వేధింపులే కారణమని సుష్మ తల్లితండ్రులు ఆరోపిస్తన్నట్టు ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. ఆమె మృతిపై భర్త, అత్త మామ, మరిదిపై 304బీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

పాడు బుద్ధి.. పోయే కాలం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 20 , 2025 | 08:10 AM