Hyderabad: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా
ABN , Publish Date - Feb 27 , 2025 | 08:40 AM
గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 41కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి నగరానికి గంజాయి సరఫరా అవుతుందని నార్కోటిక్, మధురానగర్(Narcotic, Mathuranagar) పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు.
- ముగ్గురి అరెస్ట్.. 41 కిలోల సరుకు, రూ. 40 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 41కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి నగరానికి గంజాయి సరఫరా అవుతుందని నార్కోటిక్, మధురానగర్(Narcotic, Mathuranagar) పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. వెంగళరావునగర్ నలంద పాఠశాల వద్ద ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ వార్తను కూడా చదవండి: Ration cards: కొత్త రేషన్ కార్డులకు అర్హులు 29వేల మంది..

ఒడిశా కొరాపుట్(Odisha, Koraput)కు చెందిన బాలహంతల్ గంజాయిని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటాడు. రెండు రోజుల క్రితం నగరానికి గంజాయి తీసుకొచ్చాడు. విక్రయించడానికి కూకట్‌పల్లి(Kukatpally)కి చెందిన బుర్రా శ్రీనివాసులు అలియాస్ వాసు, గోనుగుంట అభిషేక్‌ను సమకూర్చుకున్నాడు. ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి, రూ. 40 లక్షలు, స్వాధీనం చేసుకున్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News