Mother kills child: ప్రియుడికి నచ్చలేదని.. కన్న కూతురిని చంపేసింది..
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:02 PM
ఆమె జోలపాట పాడి తన మూడేళ్ల కూతురిని నిద్రపుచ్చింది. నిద్రపోతున్న బిడ్డను తీసుకుని సరస్సు దగ్గరకు వాకింగ్‌కు వెళ్లింది. ఎవరూ లేని సమయం చూసి ఆ చిన్నారిని సరస్సులోకి విసిరేసి ఏమీ తెలియనట్టు కూర్చుంది. అనంతరం తన కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె జోలపాట పాడి తన మూడేళ్ల కూతురిని నిద్రపుచ్చింది. నిద్రపోతున్న బిడ్డను తీసుకుని సరస్సు దగ్గరకు వాకింగ్‌కు వెళ్లింది. ఎవరూ లేని సమయం చూసి ఆ చిన్నారిని సరస్సులోకి విసిరేసి ఏమీ తెలియనట్టు కూర్చుంది. అనంతరం తన కూతురు తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రియుడికి నచ్చలేదని కన్న కూతురిని ఆ మహిళ చంపుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది (Toddler tragedy).
తన భర్తను వదిలేసి రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో వేరే వ్యక్తితో నివసిస్తున్న అంజలి అనే మహిళ మంగళవారం రాత్రి ఓ సరస్సు దగ్గర హెడ్ కానిస్టేబుల్ గోవింద్ శర్మకు కనిపించింది (Lake incident). అతడు ఆరా తీయగా.. తాను, తన కూతురు సరస్సు దగ్గరకు వచ్చామని, కొద్దిసేపటి క్రితం కూతురు కనిపించకుండా పోయిందని చెప్పింది. దీంతో అంజలితో కలిసి హెడ్ కానిస్టేబుల్ కూడా రాత్రంతా ఆ చిన్నారి కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో తర్వాతి రోజు ఉదయం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అంజలి తన కూతురిని ఎత్తుకుని సరస్సు దగ్గరకు రావడం, రాత్రి 1:30 గంటల సమయంలో ఒంటరిగా ఫోన్ చూస్తూ కూర్చోవడం అందులో కనిపించింది (Disturbing true crime).
అంజలి చెబుతున్నదానికి, సీసీటీవీ ఫుటేజ్‌కు తేడా రావడంతో పోలీసులకు అనుమానం పెరిగింది (Parental homicide). దీంతో ఆమెను విచారించడంతో అసలు విషయం అంగీకరించింది. తానే తన కూతురిని సరస్సులోకి విసిరేసినట్టు అంగీకరించింది. పోలీసులు సరస్సు నుంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. తనకు కూతురు ఉండడం ప్రియుడు అల్కేష్‌కు ఇష్టం లేదని, అందుకే ఈ పని చేశానని అంగీకరించింది. అయితే ఈ నేరాన్ని అంజలి ఒంటరిగానే చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News