Hyderabad: మెట్టుగూడలో కత్తుల దాడి.. అంతా కట్టుకథ
ABN , Publish Date - Feb 08 , 2025 | 07:57 AM
ట్టుగూడ(Mettuguda)లోని ఓ ఇంట్లో దుండగులు చొరబడి తల్లి, కుమారుడిపై కత్తులతో దాడి చేసింది అంతా కట్టుకథేనని చిలకలగూడ పోలీసులు తేల్చారు.

- బాధితుడే నిందితుడు
- ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం
- అడ్డువచ్చిన తల్లిపై కత్తితో దాడి
హైదరాబాద్: మెట్టుగూడ(Mettuguda)లోని ఓ ఇంట్లో దుండగులు చొరబడి తల్లి, కుమారుడిపై కత్తులతో దాడి చేసింది అంతా కట్టుకథేనని చిలకలగూడ పోలీసులు తేల్చారు. తల్లి ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న యశ్వంత్ కూరగాయలు కోసే చాకుతో పొడుచుకుని అత్మాహత్యాయత్నానికి పాల్పడగా, అడ్డువచ్చిన తల్లి రేణుకపై కత్తితో దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చిలకలగూడ పోలీస్‌స్టేషన్(Chilakalguda Police Station) పరిధి మెట్టుగూడలో రేణుక ముగ్గురు కుమారులతో నివసిస్తుంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తాతను పొడిచి చంపిన మనవడు..
మొదటి కుమారుడు యశ్వంత్ (31), రెండో కుమారుడు యశ్‌పాల్‌కు వివాహం కాలేదు. మూడో కుమారుడు వినయ్‌కు వివాహమైంది. ఇంటిపై మరో అంతస్తును నిర్మించాల ని, ఎన్నిరోజులు ఖాళీగా ఉంటావని, ఏదో ఉద్యోగం చూసుకుని వివా హం చేసుకోవాలని యశ్వంత్‌తో రేణుక ప్రతీ రోజు వాదించేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న యశ్వంత్ ఇంట్లో తల్లి వేధింపులు ఎక్కువ కావడంతో గురువారం ఉదయం ఇద్దరు తమ్ముళ్లు బయటకు వెళ్లిన అనంతరం ఇంటి తలుపులు పెట్టి కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకున్నాడు. దీనిని అడ్డుకోబోయిన తల్లిపై చాకుతో దాడి చేశాడు.
గట్టిగా ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా ఇంటిలోపల తలుపు గడియపెట్టి ఉందని, కొద్దిసేపటి తర్వాత తలుపులు తెరుచుకోగా రేణుక, యశ్వంత్(Renuka, Yashwanth) రక్తపుమడుగులో పడి ఉన్నారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో వినియోగించిన చాకును పోలీసులు స్వాధీనం చేసుకుని వేలిముద్రలను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపారు. బాధితుడే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్‌లు ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారని, వారికి ప్రాణప్రాయంలేదని వైద్యులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట
ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News