Hyderabad: తాతను పొడిచి చంపిన మనవడు..
ABN , Publish Date - Feb 08 , 2025 | 07:22 AM
ఆస్తి వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఆస్తి పంచి ఇవ్వడం లేదని తాతను సొంత మనవడే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోబోయిన తల్లిని కూడా పొడిచాడు. ఈ సంఘటన గురువారం రాత్రి బేగంపేట ప్రజాభవన్ ఎదురుగా ఉన్న వీధిలో చోటుచేసుకుంది.

- అడ్డుకోబోయిన తల్లికీ కత్తిపోట్లు
- ఆస్తి వివాదం నేపథ్యంలో ఘటన
- పోలీసుల అదుపులో నిందితుడు
హైదరాబాద్: ఆస్తి వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఆస్తి పంచి ఇవ్వడం లేదని తాతను సొంత మనవడే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోబోయిన తల్లిని కూడా పొడిచాడు. ఈ సంఘటన గురువారం రాత్రి బేగంపేట ప్రజాభవన్ ఎదురుగా ఉన్న వీధిలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలమాటి చంద్రశేఖర జనార్దన్‌రావు(86)కు పటాన్‌చెరు, బాలానగర్(Balanagar) పారిశ్రామికవాడల్లో ఇంజనీరింగ్ పరిశ్రమలు ఉన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రియుడి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య
ఆయన కుమార్తె సరోజినీదేవి. భర్తతో విభేదాలు రావడంతో తండ్రి ఇంటి వద్దే ఉంటున్నది. ఆమె కుమారుడు కిలారు కీర్తితేజ(29) తల్లిదండ్రులతో కాకుండా వేరేగా ఉంటున్నాడు. కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం జనార్దన్‌రావు మనవడు కీర్తితేజకు రూ. నాలుగు కోట్ల వరకు డబ్బులు ఇచ్చాడు. తనకు ఇంకా డబ్బులు కావాలని, తనను సరిగ్గా పెంచలేదని తాతతో తరచూ గొడవ పడేవాడు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తాత జనార్దన్‌రావు(Janardhan Rao) ఇంటికి వచ్చిన కీర్తి తేజ తనకు ఆస్తి పంచి ఇవ్వాలని ఆయనతో ఘర్షణ పడ్డాడు.
తల్లి అతన్ని వారించింది. కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు తాతను పొడిచాడు. తల్లి అడ్డుకోబోగా ఆమెను కూడా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తేరుకున్న తల్లి సరోజినీదేవి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి కుమారుడు వెలమాటి గంగాధర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కీర్తి తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట
ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News