Hyderabad: ఉద్యోగాలిప్పిస్తామని.. రూ. కోటీ 40 లక్షలు వసూలు చేసి...
ABN , Publish Date - Aug 15 , 2025 | 09:58 AM
ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటీ 40 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తులపై పోలీసులు, సిట్ ద్వారా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- వారిపై విచారణ జరిపించి న్యాయం చేయండి
- రాష్ట్ర ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి
హైదరాబాద్: ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటీ 40 లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తులపై పోలీసులు, సిట్ ద్వారా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన బాధితులు కె.నాగరాజు, ఎన్.విజయ మాట్లాడుతూ.. కరీంనగర్‌కు బిజ్జిగిరి శ్రీనివాస్ అతడి స్నేహితుడు అబ్బోజు శ్రీనివాస్(Abboju Srinivas) అతడి చెల్లెలు శ్యామల కాంట్రాక్టు ఆధారిత ఉద్యోగాలు ఇస్తామని తమ నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిపారు.
ఇందుకోసం రాంగోపాల్‌పేట సింధి కాలనీలో 16 మందికి శిక్షణ ఇచ్చారని, శిక్షణ కాలంలో ఒక్కొక్కరికి నెలకు రూ. 6 వేల చొప్పున స్టైఫండ్‌ను బాధితుల అకౌంట్‌లో వేశారని, అప్పటికే తాము రూ. 40 లక్షలు చెల్లించామని వారు పేర్కొన్నారు. మొత్తం 23 మంది బాధితుల నుంచి రూ. కోటి 40లక్షలు వసూలు చేశారు గానీ, ఇప్పటివరకు ఉద్యోగాలు ఇప్పించలేదని, వారు ఇచ్చిన ఉద్యోగ ఆర్డర్ కాపీ నకీలదని తేలిందన్నారు.

తాము మోసపోయామని గ్రహించి 2024 జూలై 5న రాంగోపాల్‌పేట పీఎ్‌సలో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. తమను మోసం చేసిన వారిని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఇంతవరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని తమను మోసం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల ని, తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇప్పిం చి న్యాయం చేయాలని బాధితులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News