Hyderabad: పండ్ల వ్యాపారం మాటున తుపాకీ విక్రయానికి యత్నం
ABN , Publish Date - Oct 09 , 2025 | 08:57 AM
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం పేరుతో తుపాకులు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నేరగాళ్లను సిటీ స్పెషల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ సిటీ: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం పేరుతో తుపాకులు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నేరగాళ్లను సిటీ స్పెషల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ అడిషనల్ సీపీ (క్రైమ్ అండ్ సిట్) తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన విజయ్ యాదవ్(Vijay Yadav), బంటి కుమార్ యాదవ్ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. లింగపల్లి(Lingapalli) ప్రాంతంలో మద్యం దుకాణాలు, బార్ షాపుల వద్ద పండ్ల వ్యాపారం చేస్తున్నారు.
ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా తమ రాష్ట్రంలో సులభంగా దొరికే తుపాకులను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్(Hyderabad)లో విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఫలక్‌నుమా ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం ప్రయత్నిస్తుండగా సీసీఎస్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ భిక్షపతి టీమ్ ఫలక్‌నుమా పోలీసులతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు.

వారి నుంచి ఒక దేశవాళీ తుపాకీ (0.7 ఎంఎం), రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించిన క్రమంలో జార్ఖండ్‌కు చెందిన మరో నిందితుడు సోనూకుమార్ ద్వారా తుపాకీని రూ.58వేలకు కొనుగోలు చేసి దాన్ని నగరంలో ఎక్కువ ధరకు విక్రయుంచి సొమ్ము చేసుకోవాలని చూసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సోనూకుమార్ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News