Share News

Hyderabad: ప్రేమించిన యువతి దక్కదేమోనని.. ఆ యువకుడు చేసిన పనేంటో తెలిస్తే..

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:59 AM

ప్రేమించిన యువతి దక్కదేమోనని భావించిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందమూరినగర్‌లో చోటు చేసుకుంది.

Hyderabad: ప్రేమించిన యువతి దక్కదేమోనని.. ఆ యువకుడు చేసిన పనేంటో తెలిస్తే..

- యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమించిన యువతి దక్కదేమోనని భావించిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందమూరినగర్‌(Nandamuri Nagar)లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి రాజు, ఎస్‌ఐ నందితలు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌కు చెందిన వంశీ(24) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బోయినపల్లిలోని నందమూరినగర్‌లో తన చిన్నమ్మ భూమవ్వ వద్ద ఉంటూ సెంట్రింగ్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.


ఈ క్రమంలో తన బంధువుల అమ్మాయి శ్రీజ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం కాస్త బంధువులకు తెలిసింది. దీంతో ఇటీవల దగ్గరి బంధువు మృతి చెందితే అక్కడకు వెళ్లిన వంశీని బంధువులు మందలించారు. అదేరోజు పాపన్నపేటలోని కళాశాలలో శ్రీజ(Sreeja)ను కలవడానికి వెళ్ళాడు. అక్కడ తనను ఇబ్బంది పెట్టవద్దని కోరగా, అతడు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చాడని తెలిపారు. దీంతో తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనని మనస్థాపం చెందిన వంశీ అదేరోజు అర్ధరాత్రి బంధువులు అందరూ నిద్రపోయిన తర్వాత


ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉరివేసుకుని చనిపోతున్నట్లు తన బావమరిది జల్ల శివయ్యకు ఫోన్‌ చేసి చెప్పడంతో వెంటనే వారు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నందమూరినగర్‌ రైల్వేట్రాక్‌ వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న బోయినపల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 11:59 AM