Share News

Hyderabad: సైబర్‌ కి‘లేడీ’.. కేడీ.. రూ.24.44 లక్షలు కొల్లగొట్టేసింది...

ABN , Publish Date - Dec 10 , 2025 | 07:00 AM

సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటివరకు కేవలం యువకులే ఈ మోసాలకు పాల్పడగా తాజాగా... మహిళలు కూడా ఈ తరహ మోసాలకు పాల్పడడం విశేషం. నగరంలో ఓ వ్యక్తిని సైబర్‌ కి‘లేడీ’ మోసగించి రూ.24.44 లక్షలను దోచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: సైబర్‌ కి‘లేడీ’.. కేడీ.. రూ.24.44 లక్షలు కొల్లగొట్టేసింది...

- కేడీవన్‌ గోల్డ్‌ పేరుతో మోసం

- రూ.24.44 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ లేడీ

హైదరాబాద్‌ సిటీ: గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అనతికాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ లేడీ ఓ వ్యక్తిని మోసం చేసి రూ.24.44 లక్షలు కొల్లగొట్టింది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌(Secunderabad)కు చెందిన 47 ఏళ్ల వ్యక్తికి ఒక నంబర్‌ నుంచి వాట్సాప్‌ మెసేజ్‌(WhatsApp message) వచ్చింది. శరణ్యగా పరిచయం చేసుకున్న మహిళ.. కొద్దిరోజుల్లోనే స్నేహితురాలిగా మారింది. అనంతరం తన పథకం ప్రారంభించింది.


తన వద్ద మంచి గోల్డ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్లాన్‌ ఉందని, అందులో పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. ‘కేడీఈ వన్‌ గోల్డ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. వివరాలు నమోదు చేసి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డు ఇచ్చింది. ప్రారంభంలో కొద్దిమొత్తంలో పెట్టుబడి పెట్టిన బాధితునికి 70 శాతం లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించి ఆశపెట్టారు.


city1.2.jpg

దీంతో భారీగా పెట్టుబడి పెట్టాడు. లాభంతో కలిపి రూ.39 లక్షలు వచ్చినట్లు చూపించారు. విత్‌డ్రా కోసం ప్రయత్నించగా ట్యాక్స్‌, కన్వర్షన్‌ చార్జెస్‌ అంటూ రూ.లక్షల్లో డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దాంతో ఇదేదో మోసమని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘కేడీఈ వన్‌ గోల్డ్‌’ అనేది నకిలీ యాప్‌గా పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2025 | 07:00 AM