Hyderabad: సెల్‌ఫోన్ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:48 AM
ఓ మహిళ.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ 10 తులాల బంగారం బ్యాగును మరచిపోయిన విషయం నగరంలో చోటుచేసుకుంది. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి ఆ బ్యాగును పట్టకోగలిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- అప్పగించిన నాచారం పోలీసులు
హైదరాబాద్: సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఓ మహిళ తన 10 తులాల బంగారు ఆభరాణాల బ్యాగును ఆర్టీసీ బస్సులో మర్చిపోయింది. ఈ సంఘటన మంగళవారం నాచారం పోలీస్‌స్టేషన్(Nacharam Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన వి.శ్రీదేవి మంగళవారం సాయంత్రం 7గంటల సమయంలో 10 తులాల బంగారు ఆభరణాల బ్యాగుతో తార్నాక బస్‌స్టాప్ వద్ద చర్లపల్లి వైపు వెళ్లే బస్సు ఎక్కింది. నాచారం వద్దకు రాగానే ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది.

దాంతో ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా ఆభరణాలున్న బ్యాగును బస్సులో వదిలేసి కిందికి దిగింది. కొద్దిసేపటి తరువాత ఆమెకు బ్యాగు గుర్తుకు రావడంతో కంగారుపడి వెంటనే నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సు ఏ డిపోకు చెందిందో సమాచారాన్ని తెలుసుకుని, ఆ బస్సు డ్రైవర్‌కు, కండక్టర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. కండక్టర్ వెంటనే బస్సులో ఆమె కూర్చున్న సీట్‌లో ఉన్న బ్యాగును తీసుకున్నాడు. అనంతరం సీఐ ధనుంజయ్య సమక్షంలో కండక్టర్ చేతుల మీదుగా బాధిత మహిళకు 10 తులాల బంగారు ఆభరణాల బ్యాగును అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Read Latest Telangana News and National News