Share News

Hyderabad: వందా, రెండొందలు కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - May 29 , 2025 | 06:59 AM

పైసాకాదు.. పావలా కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు కొల్లగొట్టేశారు సైబర్ మోసగాళ్లు. నగరానికి చెందిన ఓ మహిళను కేరళ లాటరీలో రూ. 5లక్షలు గెలిచారంటూ నమ్మించి ఆమె నుంచి రూ. 7.55 లక్షలు దోచేశారు. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: వందా, రెండొందలు కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు.. ఏం జరిగిందంటే..

- కేరళ లాటరీ పేరుతో బురిడీ

- రూ. 5లక్షలు గెలిచారంటూ ఫోన్‌

- రూ. 7.55లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ క్రిమినల్స్‌

హైదరాబాద్‌ సిటీ: కేరళ లాటరీలో రూ. 5లక్షలు గెలిచారంటూ ఓ మహిళను నమ్మించిన సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) ఆమె ఖాతా నుంచి దశలవారీగా రూ.7.55 లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని(54)కి ఏప్రిల్‌ 7న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తమ వద్ద కేరళ లాటరీ టికెట్‌(Kerala lottery ticket) కొంటే ఏ రోజుకారోజే డ్రా తీసి విజేతలను ప్రకటిస్తామని నమ్మించాడు.


దాంతో ఆమె ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు చేసింది. మరుసటిరోజు సదరు కేటుగాడు ఫోన్‌ చేసి మీరు లాటరీలో రూ.5లక్షలు గెలిచారని చెబుతూ ఓ లింకు పంపాడు. ఆ లింక్‌ను ఓపెన్‌ చేసిన మహిళ అందులో తాను కొనుగోలు చేసిన టికెట్‌ నంబర్‌ ఉండడంతో చూసి సంతోషపడింది.


city1.2.jpg

అయితే, ఆ డబ్బు మొత్తం రావాలంటే ముందస్తుగా కొన్ని పన్నులు చెల్లించాలంటూ బురిడీ కొట్టించి ఆమె నుంచి విడతలవారీగా రూ. 7.55లక్షలు దోచేశారు. అయినా ఎంతకీ లాటరీ డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించింది. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి.

Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క

ఒకే మాటపై ఉందాం!

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 03:00 PM