Hyderabad: అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో.. చికిత్స పొందుతూ..
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:23 AM
చికిత్స పొందుతూ గర్భిణి కానిస్టేబుల్ మృతి చెందింది. ఖైరతాబాద్ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పోలుదాసు విమలాకుమారి(33) అత్తాపూర్ హుడా కాలనీలో నివసిస్తోంది.
- గర్భిణి కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: చికిత్స పొందుతూ గర్భిణి కానిస్టేబుల్ మృతి చెందింది. ఖైరతాబాద్ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్(Kulsumpura Police Station)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పోలుదాసు విమలాకుమారి(33) అత్తాపూర్ హుడా కాలనీలో నివసిస్తోంది. ఆమె గర్భవతి కావడంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చూపించుకుంటోంది. ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల. ఈనెల 10వ తేదీన అస్వస్థతకు గురవడంతో భర్త, కుటుంబ సభ్యులు కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమెకు కవల పిల్లలని, ఒకరు చనిపోయారని తెలిపారు.

శస్త్రచికిత్స చేసి శిశువులను బయటకు తీశారు. చనిపోయిన శిశువును అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్లారు. ఆస్పత్రి వర్గాలు విమలాకుమారి భర్తకు ఫోన్‌చేసి మీ భార్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత చనిపోయిందని చెప్పారు. వైద్యురాలు రజని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని, మరో శిశువు వెంటిలేటర్‌పై ఉందని, 75 శాతం బతికే అవకాశాలు లేవంటున్నారని మృతురాలి భర్త ప్రదీప్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు: కేర్ ఆస్పత్రి
విమలాకుమారి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని కేర్ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తీవ్ర అస్వస్థతతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారు. గర్భంలో ఉన్న కవల పిల్లల్లో ఒకరు చనిపోవడంతో శస్త్ర చికిత్స చేసి కాపాడే ప్రయత్నం చేశామని, విమలాకుమారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ
రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు
Read Latest Telangana News and National News