Share News

Hyderabad: ప్రేమికుడు దుర్భాషలాడాడని.. యువతి చేసిన పనేంటో తెలిస్తే..

ABN , Publish Date - Aug 14 , 2025 | 09:29 AM

కొంతకాలంగా ప్రేమిస్తున్న వ్యక్తి తనపై అనుమానంతో దుర్భాషలాడాడని తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన

Hyderabad: ప్రేమికుడు దుర్భాషలాడాడని.. యువతి చేసిన పనేంటో తెలిస్తే..

- యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: కొంతకాలంగా ప్రేమిస్తున్న వ్యక్తి తనపై అనుమానంతో దుర్భాషలాడాడని తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌(Vanasthalipuram Police Station) పరిధిలో జరింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు అఖిల(24) రసూల్‌(24) ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.


కాగా అఖిల వనస్థలిపురం వెంకటరమణ కాలనీలో నివాసముంటున్న తన అక్క బావ వాళ్ల ఇంట్లో ఉంటూ నగరంలోని బొల్లారంలో బీఈడీ విద్యనభ్యసిస్తుంది. రసూల్‌ ఖమ్మంలో ప్రైవేట్‌ ఉద్యోగి. కాగా ఈనెల 7న రసూల్‌ ఖమ్మం(Khammam) నుంచి అఖిల వద్దకు వచ్చి నీవు వేరేవాళ్లతో మాట్లాడుతున్నావని, అఖిలను దుర్భాషలాడాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అఖిల ఆటోలో అక్క ఇంటికి వెళ్లింది. వెంటనే తన గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు య త్నించింది.


ఈ విషయం గమనించిన అఖిల అక్క వెంటనే తలుపులు పగులగొట్టి అఖిలను బయటకు తీసుకొచ్చి ఓ పైవ్రేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా అఖిల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు తన కూతురు అఖిలను రసూల్‌ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురును ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన రసూల్‌ను అరె్‌స్టచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా అఖిల ఆత్మహత్యకు కారణమైనట్లు భావిస్తున్న రసూల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడేది లేదు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2025 | 09:29 AM