Share News

TG News: రూ.ఆరు వందల కోసం వివాదం.. నిండు ప్రాణం బలి

ABN , Publish Date - Oct 29 , 2025 | 07:36 AM

ఆరువందల రూపాయల కోసం చెలరేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నలుగురు హోటల్‌ సిబ్బంది టూరిస్టు గైడ్‌ను చితకబాదడంతో తీవ్రగాయాలపాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

TG News: రూ.ఆరు వందల కోసం వివాదం.. నిండు ప్రాణం బలి

- టూరిస్టు గైడ్‌పై దాడి చేసిన హోటల్‌ సిబ్బంది

- చికిత్స పొందుతూ గైడ్‌ మృతి

హైదరాబాద్: ఆరువందల రూపాయల కోసం చెలరేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నలుగురు హోటల్‌ సిబ్బంది టూరిస్టు గైడ్‌ను చితకబాదడంతో తీవ్రగాయాలపాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వనాథ్‌ శంకర్‌(36) టూరిస్టు గైడ్‌గా పనిచేస్తున్నాడు. గుజరాత్‌ నుంచి ఈనెల 21న నగరానికి వచ్చిన కొంతమంది టూరిస్టులకు గైడ్‌గా వ్యవహరిస్తున్న శంకర్‌ వారందరికీ కర్మన్‌ఘాట్‌లోని ఓ ఏసీ హోటల్‌లో బస ఏర్పాటు చేశాడు.


అయితే 22వ తేదీ ఉదయం టూరిస్టులు హోటల్‌ గదిని చెక్‌ అవుట్‌ చేశారు. ఆ సమయంలో శంకర్‌(Shankar) రూ.600లు తక్కువ ఇవ్వడంతో హోటల్‌ సిబ్బందితో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో హోటల్‌ సిబ్బంది నూర్‌, కమలుద్దీన్‌, ఇస్లాం జహీదుల్‌, రహీమ్‌లు శంకర్‌పై కుర్చీతో దాడిచేయగా తల, ఇతర భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. అక్కడినుంచి తప్పించుకుని సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లి శంకర్‌ ప్రథమ చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయాడు.


city2.jfif

అయితే 26వ తేదీ శంకర్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌లోని సీసీ ఫుటేజీ ఆధారంగా నూర్‌, కమలుద్దీన్‌, ఇస్లాం జహీదుల్‌, రహీమ్‌లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.


city2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో భారీగా తగ్గుదల

భయపెడుతున్న మొంథా తుఫాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2025 | 07:36 AM