Hyderabad: అత్యాశే కొంపముంచింది.. రూ.61.95 లక్షలు గోవిందా..
ABN , Publish Date - May 31 , 2025 | 07:07 AM
హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు మొత్తం రూ.61.95 లక్షలు పోగొట్టుకున్నాడు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళితే..
- ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట మోసం
- రూ.61.95 లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు
హైదరాబాద్ సిటీ: వృద్ధుడి అత్యాశే కొంపముంచింది. సైబర్ కేటుగాడి మాయమాటలతో భారీగా నగదు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బాధితుడు డబ్బు సంపాదించాలని గత మార్చిలో బుల్ మార్కెట్ ద్వారా ఎక్స్‌పర్ట్స్ ప్రొ లిమిటెడ్ సంస్థలో రూ.21 వేలు మదుపు చేశాడు. తర్వాత ఆ సంస్థ ప్రతినిధినంటూ లైన్‌లోకి వచ్చిన వ్యక్తి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చేలా టిప్స్ చెబుతానని నమ్మబలికాడు. డాలర్లలో అంతర్జాతీయ స్టాక్ ట్రేడింగ్ గురించి చెప్పి బురిడీ కొట్టించాడు.

రూ.లక్షల్లో మదుపు చేస్తే రూ.కోట్లలో లాభాలుంటాయని నమ్మించడంతోపాటు ప్రారంభంలో లాభాలు రుచి చూపించాడు. అలా రూ.61.95 లక్షలు మదుపు చేయించారు. 75 వేల అమెరికా డాలర్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపి విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇంకా పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడితో సైబర్ మోసమని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!
Read Latest Telangana News and National News