Share News

Hyderabad: విదేశీ యువతులతో వ్యభిచారం..

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:52 AM

గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు విదేశీయులను మియాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్‌ సుభాష్ చంద్రబోస్‌ నగర్‌ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్‌ ఎస్‌ఓటీ, మియాపూర్‌ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు.

Hyderabad: విదేశీ యువతులతో వ్యభిచారం..

- వ్యభిచార గృహ నిర్వాహకుడి అరెస్ట్‌

హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు విదేశీయులను మియాపూర్‌ పోలీసులు(Miyapur Police) అరెస్ట్‌ చేశారు. సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్‌ సుభాష్ చంద్రబోస్‌ నగర్‌ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్‌ ఎస్‌ఓటీ, మియాపూర్‌ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు.


అక్కడ తనిఖీ చేయగా విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశానికి చెందిన డేరియస్‌ (28) 2021లో విద్యాభ్యాసం నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. ఇతడితో పాటు కెన్యా దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, ఉగాండా దేశానికి చెందిన మరో మహిళతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


city1.2.jpg

డేరియ్‌సతో పాటు నలుగురు విదేశీ మహిళలను అరెస్టు చేసి మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.4 వేలు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా, డేరియస్‌ ను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్‌-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్‌

తిరుమల లడ్డూ మిఠాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2025 | 07:45 AM