Share News

Hyderabad: బతుకుదెరువు కోసం వచ్చి.. బెట్టింగ్‌ దందా

ABN , Publish Date - Sep 03 , 2025 | 09:40 AM

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్న ముఠా ఆటకట్టించారు సిటీ సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. 8 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 29.81 లక్షలు, 18 సెల్‌ఫోన్‌లు, 13 ఏటీఎం కార్డులు, 3 పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: బతుకుదెరువు కోసం వచ్చి.. బెట్టింగ్‌ దందా

- ముఠా ఆటకట్టు

- 8 మంది అరెస్ట్‌.. రూ. 29.81 లక్షలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్న ముఠా ఆటకట్టించారు సిటీ సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(City South Zone Task Force Police). 8 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 29.81 లక్షలు, 18 సెల్‌ఫోన్‌లు, 13 ఏటీఎం కార్డులు, 3 పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం..


కరీంనగర్‌కు చెందిన రాజేష్‌, అస్లాం, జగిత్యాల(Jagityala)కు చెందిన వినయ్‌కుమార్‌, సాయి వర్ధన్‌గౌడ్‌, కోల రామ్‌, వేల్పుల ఆకాశ్‌, ప్రణయ్‌, పెద్దపల్లికి చెందిన రాహుల్‌, జశ్వంత్‌తేజ, జోడ వేణుగోపాల్‌ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. కొద్దిరోజులు పనులు చేసి జీవించారు. చేస్తున్న పనుల ద్వారా వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు.


city6.2.jpg

ఖేలోస్టార్‌, ఖేలో-24, ఖేలో ఎక్సైజ్‌, ఖేలో స్పోర్ట్స్‌, విన్‌ మ్యాచ్‌ వంటి ఖేలో గేమ్స్‌ యాప్‌లలో రిజిస్టర్‌ చేసుకుని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌ పరిధిలోని నాగార్జున సర్కిల్‌(Nagarjuna Circle) సమీపంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందగా దాడిచేశారు. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాలో 8 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు రాజేష్‌, అస్లాం పరారీలో ఉన్నారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2025 | 09:40 AM