Share News

Hyderabad: మ్యాట్రిమోనీ సైట్‌లో పాకిస్థానీ యూట్యూబర్‌ ఫొటో..

ABN , Publish Date - Sep 13 , 2025 | 09:32 AM

మ్యాట్రిమోనీ సైట్‌ను ప్రారంభించి, అందులో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి మోసాలు చేస్తున్న ముఠాలోని ఇద్దరిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు పాకిస్థానీ యూట్యూబర్‌ ఫొటో పెట్టి, ఆమెనే పెళ్లి కూతురుగా చూపించి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారని సైబర్‌ క్రైం అధికారులు తెలిపారు.

Hyderabad: మ్యాట్రిమోనీ సైట్‌లో పాకిస్థానీ యూట్యూబర్‌ ఫొటో..

- పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 25 లక్షలు కాజేసిన ముఠా

- ఇద్దరి అరెస్ట్‌.. పరారీలో మరో మహిళ

హైదరాబాద్‌ సిటీ: మ్యాట్రిమోనీ సైట్‌(Matrimony site)ను ప్రారంభించి, అందులో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి మోసాలు చేస్తున్న ముఠాలోని ఇద్దరిని సైబర్‌ క్రైం పోలీసులు(Cybercrime police) అరెస్ట్‌ చేశారు. నిందితులు పాకిస్థానీ యూట్యూబర్‌ ఫొటో పెట్టి, ఆమెనే పెళ్లి కూతురుగా చూపించి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారని సైబర్‌ క్రైం అధికారులు తెలిపారు.


కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌కు చెందిన అనీసా మహ్మదైసయీమ్‌(33), జొహర్‌ ఫాతిమా(24), నగరానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అమేర్‌ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఖుబ్‌సూరత్‌ రిస్తే పేరుతో వెబ్‌సైట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు ప్రారంభించారు. ఇందులో అందమైన యువతుల ఫొటోలు పెట్టి యువకులను ఆకర్షించి మోసాలు చేస్తున్నారు. నగరానికి చెందిన ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఖుబ్‌సూరత్‌ రిస్తే’’ పేరుతో ఉన్న మ్యాట్రిమోనీ పేజ్‌లో అందమైన యువతి ఫొటో చూశాడు.


అందులో మహిళ ఫోన్‌ నంబర్‌ ఉండటంతో ఆమెతో మాటలు కలిపాడు. సదరు మహిళ తరచూ వీడియో కాల్స్‌ చేసి యువకుడితో మాట్లాడేది. త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్పేది. ఆమె మాటలు నమ్మిన బాధితుడు ఆమెతో తరచూ చాటింగ్‌లో ఉండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం అంటూ సాకులు చెప్పిన మహిళ పలు దఫాలుగా రూ.25 లక్షలు వసూలు చేసింది. తర్వాత మ్యాట్రిమోనీ ప్రొఫైల్‌లో తాను చూసిన యువతి ఫొటో.. పాకిస్థానీ యూ ట్యూబర్‌దని గ్రహించాడు.


డబ్బు తిరిగి ఇవ్వమనగా నిందితులు తిరస్కరించడంతో సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులు అనీసా, అబ్దుల్‌ అమేర్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రెండు మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, ఐదు బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, మూడు చెక్‌బుక్‌లు, మూడు డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళ జొహర్‌ ఫాతిమా పరారీలో ఉన్నట్లు సైబర్‌ క్రైం అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 09:48 AM