Hyderabad: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.12.56 లక్షలు కొట్టేశారు..
ABN , Publish Date - Sep 30 , 2025 | 07:23 AM
ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.12.56 లక్షలను కాజేశారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు సెప్టెంబరు ఒకటిన ఇన్‌స్టాగ్రాంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ యాడ్‌ను చూశాడు.
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.12.56 లక్షలను కాజేశారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు(Hyderabad City Cyber Crime Police) తెలిపిన వివరాల ప్రకారం బేగంబజార్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు సెప్టెంబరు ఒకటిన ఇన్‌స్టాగ్రాంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ యాడ్‌ను చూశాడు. మోతీలాల్ ఓస్వాల్ లోగో ఉన్న దానిపై క్లిక్ చేశాడు. అనంతరం వాట్సాప్‌లో ఎల్47 క్వాంట్ ఇన్వె్‌స్టమెంట్ గ్రూపు క్రియేట్ అయింది. స్టాక్స్ కొనుగోలు ద్వారా మంచి లాభాలు వస్తాయని అందులో మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి.

నిజమేనని నమ్మిన బాధితుడు ఎంఓడీఎంఏ యాప్(MODMA app) ద్వారా విడతల వారీగా రూ.12,56,900 పెట్టుబడి పెట్టాడు. లాభంతో కలిపి రూ.46,89,375లు వచ్చినట్లు వర్చువల్‌గా కనిపించింది. డబ్బులను డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, మరో రూ.7.60లక్షలు పెట్టుబడి పెట్టాలని ఫోన్ వచ్చింది. ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News