Share News

Hyderabad: ‘క్రిప్టో’ పేరుతో రూ.కోటికి టోకరా..

ABN , Publish Date - Dec 24 , 2025 | 07:19 AM

ఓ వ్యక్తి కోటి రూపాయల నగదును కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నగరం పాతబస్తీలో చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: ‘క్రిప్టో’ పేరుతో రూ.కోటికి టోకరా..

హైదరాబాద్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి కోటి రూపాయల నగదు తీసుకుని పరారైన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌(Panjagutta Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ మురాద్‌ నగర్‌కు చెందిన ఒమర్‌కు స్నేహితుడు హమీద్‌ ద్వారా నోమాన్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. క్రిప్టో కరెన్సీ కాయిన్‌లను కొనుగోలు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము వస్తుందని చెప్పడంతో ఒమర్‌ కోటి రూపాయల నగదు సేకరించాడు.


క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసేందుకు ఈ నెల 21న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1(Banjara Hills Road Number 1)లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌ పార్కింగ్‌ వద్దకు నగదు తీసుకుని ఒమర్‌తో పాటు, హమీద్‌, అద్నాన్‌ వచ్చారు. అక్కడ వారికి ఎథేషామ్‌ అనే వ్యక్తి కలిసి వారి నుంచి రూ.కోటి తీసుకున్నాడు. హోటల్‌లోని ఇ-ఫ్లోర్‌లో క్రిప్టో కాయిన్స్‌ ఇచ్చే మాలిక్‌ అనే వ్యక్తి కార్యాలయం ఉందని, అతనికి డబ్బు ఇచ్చి కాయిన్స్‌ తెస్తానని నమ్మబలికాడు. మాలిక్‌ను కలవడానికి ఎవరికీ అనుమతి లేదని చెప్పాడు.


city2.2.jpg

ఎథేషామ్‌, హమీద్‌ ఇద్దరూ లాబీకి చేరుకున్నారు. హమీద్‌ను వేచి ఉండమని చెప్పి ఎథేషామ్‌ నగదుతో పాటు ఒంటరిగా లిఫ్ట్‌లో పైకి వెళ్లాడు. రాత్రి 7.30 అయినా ఎథేషామ్‌ తిరిగి రాలేదు. హమీద్‌, నోమాన్‌ అతడికి ఫోన్‌ చేయగా స్పందించలేదు. శాలిబండలోని ఎథేషామ్‌ ఇంటికి వెళ్తే అక్కడ కూడా లేడు. దీంతో మోసపోయామని గ్రహించారు. పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2025 | 07:22 AM