Share News

Hyderabad: మద్యం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 26 , 2025 | 08:19 AM

మద్యం మత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నవజీవన్‌నగర్‌ (గీతానగర్‌)లో బుధవారం రాత్రి జరిగింది. బాలానగర్‌ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: మద్యం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

- మద్యం మత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

హైదరాబాద్: మద్యం మత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Balanagar Police Station) పరిధిలోని నవజీవన్‌నగర్‌ (గీతానగర్‌)లో బుధవారం రాత్రి జరిగింది. బాలానగర్‌ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్‌కు చెందిన పాతరపల్లి నాగరాజు(44) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి బాలానగర్‌ గీతానగర్‌(Balanagar Geethanagar)లో లేథ్‌ మిషన్‌ వర్క్స్‌ పేరుతో వర్క్‌ షాపును నిర్వహిస్తున్నాడు.


city4.2.jfif

బుధవారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ వైన్‌ షాపులో మద్యం తాగాడు. అక్కడి నుంచి వర్క్‌ షాపు వద్దకు వచ్చిన నాగరాజు మరోసారి షాపులోనే మద్యం తాగాడు. భవనం రెండో అంతస్తులో టాయిలెట్స్‌ ఉండడంతో మూత్ర విసర్జన కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి వెళ్లాడు. మద్యం మత్తులో ఉండడం, రెండో అంతస్తులో రెయిలింగ్‌ లేకపోవడంతో అదుపుతప్పి కింద పడ్డాడు.


city4.jpg

దీంతో తలకు బలయైున గాయమైంది. కిందపడిన నాగరాజు(Nagaraju)ను స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై మహ్మద్‌ హాజీమియా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..

కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Sep 26 , 2025 | 08:28 AM