Hyderabad: నాగపూర్‌లో కొనుగోలు.. రైలులో హైదరాబాద్కు..
ABN , Publish Date - Dec 02 , 2025 | 09:38 AM
మహారాష్ట్రలోని నాగ్ పూర్ తో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 4.104 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- గంజాయి తీసుకొస్తున్న వ్యక్తి అరెస్ట్
సికింద్రాబాద్: నాగపూర్(Nagpur)లో గంజాయి కొనుగోలు చేసి, ఆ సరుకును రైలులో తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 4.104 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో సోమవారం డీస్పీ జావెద్, ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ లాలాపేట్ శాంతినగర్ ప్రాంతానికి చెందిన షేక్ వాయిద్ (21) బైక్ మెకానిక్.

సులువుగా డబ్బు సంపాదించేందుకు తనకు పరిచయమైన నాగాపూర్‌లో ఉంటున్న వ్యక్తుల నుంచి గంజాయి కోనుగోలు చేశాడు. నవంబరు 30న నాగపూర్‌లో రైలు ఎక్కి సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగాడు. ఆ సమయంలో రైల్వే పోలీసులు వాయిద్ బ్యాగును తనిఖీ చేయగా గంజాయి లభించింది. వాయిద్ ఇటీవల గంజాయి విక్రయ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News