Hyderabad: గ్యాంగ్‌రేప్ కేసులో యువకుడికి 25 ఏళ్ల జైలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:03 AM
బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ఓ యువకుడికి 25 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ అనుదీప్ వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నామాలగుండుకు చెందిన కమలాకర శివకుమార్ ఆలియాస్ శివ(19) ప్రైవేట్ ఉద్యోగి.
హైదరాబాద్: బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ఓ యువకుడికి 25 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ అనుదీప్(Chilakalguda Inspector Anudeep) వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నామాలగుండుకు చెందిన కమలాకర శివకుమార్ ఆలియాస్ శివ(19) ప్రైవేట్ ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2021 జనవరిలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికను తన గదికి తీసుకువెళ్లి బెదిరించి గ్యాంప్ రేప్‌కు పాల్పడ్డారు.
ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి, ఎవరికైనా చెపితే వీటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. అనారోగ్యం బారిన బాలికకు కుటుంబసభ్యులు వైద్యం చేయించిన తర్వాత ఆరా తీయగా తనపై నలుగురు యువకులు అత్యాచారం చేశారని తెలిపింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పొక్సో, ఐటీ చట్టాల ప్రకారం కేసును నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నాలుగు సంవత్సరాలు కోర్టు లో కేసు నడిచిన తర్వాత వాదోపవాదాలు విన్న నాంపల్లి 12వ అదనపు జడ్జి అనిత సోమవారం తీర్పునిచ్చారు.
బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లు నేరం రుజువు కావటంతో ప్రధాన నిందితుడు కమలాకర శివకుమార్ కు పోక్సో చట్టం కింద 25 ఏళ్ల జైలుశిక్ష, ఐదువేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించకుంటే మరో ఆరునెలల జైలుశిక్ష, ఐటీ చట్టం ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష, ఐదువేల జరిమానా, జరిమా నా చెల్లించకుం టే మరో మూడునెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు శివ కుమార్‌ను సోమవారం చంచల్‌గూడ జైలు కు తరలించారు.

ఈ కేసులో మరో ముగ్గురు మైనర్లకు మూడేళ్ల జైలుశిక్ష విధించి వారిని జ్యువెనల్ హోంకు తరలించారు. బాధిత బాలికకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును అప్పటి దర్యాప్తు అధికారిగా ఏసీపీ వెంకటరమణ ప్రసుత్త కరీంనగర్ అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామిరెడ్డి, లీగల్ సపోర్ట్ కల్పన, సీడీఓ తులసీదా్‌సలు వ్యవహరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!
బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి