Share News

Hyderabad: ఆ నీచుడికి యావజ్జీవ కారాగారశిక్ష.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Sep 25 , 2025 | 09:34 AM

కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న ఓ తండ్రికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ.10 వేల జరిమానా పడింది. వివరాల్లోకి వెళితే... జగద్గిరిగుట్ట పోలీస్‏స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న శంకరంపేట్‌ అనిల్‌గౌడ్‌(34) సెంట్రింగ్‌ పని చేస్తున్నాడు.

 Hyderabad: ఆ నీచుడికి యావజ్జీవ కారాగారశిక్ష.. విషయం ఏంటంటే..

- కూతురిపై లైంగికదాడికి పాల్పడిన తండ్రికి యావజ్జీవం

- ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు వెల్లడి

హైదరాబాద్: కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న ఓ తండ్రికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ.10 వేల జరిమానా పడింది. వివరాల్లోకి వెళితే... జగద్గిరిగుట్ట పోలీస్‏స్టేషన్‌(Jagadgirigutta Police Station) పరిధిలో నివాసముంటున్న శంకరంపేట్‌ అనిల్‌గౌడ్‌(34) సెంట్రింగ్‌ పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గత సంవత్సరం ఏప్రిల్‌ 23న భార్య ఇంట్లో లేని సమయంలో 5వ తరగతి చదువుతున్న కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.


city6.2.jfif

ఇలాగే బెదిరించి పలుమార్లు సైతం దారుణానికి ఒడిగట్టాడు. కూతురు ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద అప్పటి సీఐ క్రాంతికుమార్‌ కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించడంతో నిందితుడికి జీవితఖైదుతో పాటు జరిమానాను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు జడ్జి అమరావతి విధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 09:34 AM