Share News

Hyderabad: భార్య మృతితో మనస్తాపం.. మూసీలో దూకిన డేటా ఆపరేటర్‌

ABN , Publish Date - Aug 19 , 2025 | 07:24 AM

భార్య చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన డేటా ఆపరేటర్‌ మూసీ నదిలో దూకి గల్లంతయ్యాడు. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. చాదర్‌ఘాట్‌కు చెందిన బాలరాజ్‌గౌడ్‌ కుమారుడు కిరణ్‌గౌడ్‌(47) ఆబిడ్స్‌లోని పేఅండ్‌ అకౌంట్స్‌లో డేటా ఆపరేటర్‌.

Hyderabad: భార్య మృతితో మనస్తాపం.. మూసీలో దూకిన డేటా ఆపరేటర్‌

హైదరాబాద్: భార్య చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన డేటా ఆపరేటర్‌ మూసీ నది(Musi River)లో దూకి గల్లంతయ్యాడు. కాచిగూడ పోలీసులు(Kacheguda Police) తెలిపిన వివరాల ప్రకారం. చాదర్‌ఘాట్‌(Chadarghat)కు చెందిన బాలరాజ్‌గౌడ్‌ కుమారుడు కిరణ్‌గౌడ్‌(47) ఆబిడ్స్‌లోని పేఅండ్‌ అకౌంట్స్‌లో డేటా ఆపరేటర్‌. అతనికి భార్య, ఇద్దరు కుమారులు.


city2.2.jpg

అయితే, నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయింది. అప్పటి నుంచి కిరణ్‌గౌడ్‌ మానసిక ప్రవర్తన సరిగ్గా ఉండడంలేదు. సోమవారం చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వద్ద మూసీలోకి దూకడంతో వరదనీటిలో కొట్టుకుపోయాడు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Read Latest Telangana News and National News

Updated Date - Aug 19 , 2025 | 07:24 AM