Share News

Hyderabad: రూ.25 లక్షలతో ఉడాయించిన క్యాబ్‌ డ్రైవర్‌.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 11 , 2025 | 10:17 AM

సికింద్రాబాద్‌ సిటీ యూనియన్‌ బ్యాంకు మెయిన్‌ బ్రాంచి నుంచి బాలానగర్‌ బ్రాంచ్‌ సిబ్బంది డబ్బులు తెస్తుండగా క్యాబ్‌ డ్రైవర్‌ డబ్బుపెట్టెతో ఉడాయించాడు. ఈ ఘటన బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

Hyderabad: రూ.25 లక్షలతో ఉడాయించిన క్యాబ్‌ డ్రైవర్‌.. ఏం జరిగిందంటే..

హైదరాబాద్: సికింద్రాబాద్‌ సిటీ యూనియన్‌ బ్యాంకు మెయిన్‌ బ్రాంచి నుంచి బాలానగర్‌ బ్రాంచ్‌ సిబ్బంది డబ్బులు తెస్తుండగా క్యాబ్‌ డ్రైవర్‌ డబ్బుపెట్టెతో ఉడాయించాడు. ఈ ఘటన బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Balanagar Police Station) పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. బాలానగర్‌ సీఐ టి.నర్సింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్‌ సిటీ యూనియన్‌ బ్యాంకుకు చెందిన క్లర్క్‌ నర్సింగ్‌రావు, సెక్యూరిటీ గార్డు నాగేశ్వర్‌ డబ్బులు తెచ్చేందుకు బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ మెయిన్‌ బ్రాంచికి వెళ్లారు.


బ్యాంకు నుంచి రూ.25లక్షల నగదు తీసుకుని బాలానగర్‌ బ్రాంచ్‌ వరకు టీఎస్‌10 యూబీ 4911 నంబరు గల క్యాబ్‌లో వచ్చారు. అయితే బాలానగర్‌ చేరుకున్న తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా అతడు డబ్బుపెట్టెతో ఉడాయుంచాడు.

డబ్బుతో ఉడాయించిన క్యాబ్‌ డ్రైవర్‌ను బ్యాంకు సెక్యూరిటీ గార్డు నాగేశ్వర్‌ ఆటోలో బోయినపల్లి వరకు వెంబడించాడు. ఆ తర్వాత కారు కనిపించలేదు. బ్రాంచి మేనేజర్‌ సందీప్‌ బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


city6.2.jpg

సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు..

బాలానగర్‌ బీబీఆర్‌ పక్కనున్న భారత్‌ లాడ్జ్‌ పక్క సందుగుండా నవజీవన్‌నగర్‌ వైపు కారు వెళ్లిందని, అక్కడి నుంచి బాలానగర్‌ మెయిన్‌ రోడ్డు వైపు వచ్చినట్లు సీసీ ఫుటేజీ అధారంగా పోలీసులు గుర్తించారు. కారు నంబరు ప్రకారం క్యాబ్‌ డ్రైవర్‌ ఉస్మాన్‌ ఆలీ అని తేలినట్లు తెలిసింది. డ్రైవర్‌కు గతంలో నేర చరిత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన బాలానగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు సీసీఎస్‌, ఎస్‌వోటీ పోలీసులు కూడా గాలిస్తున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పిడుగుపాట్లకు 9 మంది బలి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 11 , 2025 | 10:17 AM