Share News

Hyderabad: లలిత, పిల్లలు.. నన్ను క్షమించండి

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:05 AM

‘లలిత, పిల్లలు నన్ను క్షమించండి, నాన్న, అమ్మను మంచిగా చూసుకోండి’ అని సూసైడ్‌ లెటర్‌ రాసి చిన్న తరహా కంపెనీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం సీఐ భరత్‌కుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. సూరారం కృషికాలనీకి చెందిన మురళీధర్‌రెడ్డి(46) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

Hyderabad: లలిత, పిల్లలు.. నన్ను క్షమించండి

- నాన్న, అమ్మను సరిగా చూసుకోండి

- సూసైడ్‌ నోట్‌ రాసి వ్యాపారి ఆత్మహత్య

హైదరాబాద్: ‘లలిత, పిల్లలు నన్ను క్షమించండి, నాన్న, అమ్మను మంచిగా చూసుకోండి’ అని సూసైడ్‌ లెటర్‌ రాసి చిన్న తరహా కంపెనీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం సీఐ భరత్‌కుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. సూరారం కృషికాలనీకి చెందిన మురళీధర్‌రెడ్డి(46) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. జీడిమెట్ల సుభాష్ నగర్‌(Jeedimetla Subhash Nagar)లోని వినాయక ఇండస్ర్టీలో సత్యనారాయణగౌడ్‌తో కలిసి ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం మురళీధర్‌ రెడ్డికి రూ.30 లక్షలు రావాల్సి ఉంది.


city6.2.jpg

భాగస్వామి సత్యనారాయణగౌడ్‌, అకౌంటెంట్‌ ఫణికుమార్‌ లెక్కలు చూపించకుండా అతడికి రావాల్సిన డబ్బు ఇవ్వకుండా దాటవేస్తున్నారు. మనస్థాపానికి గురైన మురళీధర్‌ రెడ్డి తాను ఉంటున్న ఇంటిపైన పెంట్‌ హౌజ్‌లో టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌లో సత్యనారాయణగౌడ్‌తో పాటు మరో నలుగురు మోసం చేసినట్లు ఉన్నదని పోలీసులు తెలిపారు. భార్య లలిత ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ భరత్‌కుమార్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే

Read Latest Telangana News and National News

Updated Date - Jun 19 , 2025 | 11:05 AM