Share News

Hyderabad: రాజస్థాన్‌ నుంచి నగరానికి హెరాయిన్‌..

ABN , Publish Date - Jul 15 , 2025 | 09:57 AM

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా హెరాయిన్‌ రవాణా చేసి నగరంలో గుట్టుగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఆటకట్టించారు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీఎఫ్‌ పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అతని వద్ద రూ. 3లక్షల విలువైన 17 గ్రాముల హెరాయిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: రాజస్థాన్‌ నుంచి నగరానికి హెరాయిన్‌..

- బేగంబజార్‌లో విక్రయిస్తున్న స్మగ్లర్‌

- ఆటకట్టించిన ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు

- రూ. 3 లక్షల విలువైన సరుకు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: రాజస్థాన్‌(Rajasthan) నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా హెరాయిన్‌ రవాణా చేసి నగరంలో గుట్టుగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఆటకట్టించారు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీఎఫ్‌ పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అతని వద్ద రూ. 3లక్షల విలువైన 17 గ్రాముల హెరాయిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన స్మగ్లర్‌ ప్రధాన్‌ గుజ్జర్‌ కొంతకాలంగా నగరానికి హెరాయిన్‌ సరఫరా చేస్తున్నాడు.


డ్రగ్స్‌తో రహస్యంగా నగరానికి వచ్చి కస్టమర్స్‌కు గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకొని వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిఘా పెట్టారు. డీటీఎఫ్‌ సీఐ సౌజన్య ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన టీమ్‌ బగ్గ వైన్స్‌ సమీపంలో హెరాయిన్‌ విక్రయించడానికి కస్టమర్స్‌ కోసం ఎదురు చూస్తున్న నిందితుడు ప్రధాన్‌ గుజ్జర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 17 గ్రాముల హెరాయిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.


city6.jpg

బేగంబజార్‌ పరిధిలో ఉండే బడాబాబులకు ఈ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ విలువ రూ. 3లక్షలు ఉంటుందని ఏఈఎస్‌ శ్రీనివాసరావు తెలిపారు. హెరాయిన్‌ పట్టుకున్న టీమ్‌ సీఐ సౌజన్యతోపాటు ఎస్‌ఐలు శివకృష్ణ, వెంకటేష్‌, సత్యనారాయణ, రాజు రవి, శిల్ప, సునీతను డిప్యూటీ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పంచాక్షరి అభినందించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ను, అరెస్టు చేసిన స్మగ్లర్‌ను నారాయణగూడ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2025 | 09:57 AM