Share News

Hyderabad: స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి దోపిడీ..

ABN , Publish Date - Jan 30 , 2025 | 07:29 AM

స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(Software employee)ని మాదాపూర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న హరీష్‏కృష్ణ(35) గాజులరామారం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

Hyderabad: స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి దోపిడీ..

- సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(Software employee)ని మాదాపూర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న హరీష్‏కృష్ణ(35) గాజులరామారం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడిన హరీష్‏కృష్ణ(Harish Krishna) సహోద్యోగి, స్నేహితుడైన మణికంఠ ఇంట్లో దొంగతనానికి వ్యూహం పన్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Khammam: తరగతి గదిలో కిందపడి గాయం.. చికిత్స పొందుతూ బాలిక మృతి


city2.jpg

ఈనెల 25న మణికంఠ క్రికెట్‌ ఆడటానికి గ్రౌండ్‌కి వెళ్లాడని వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా తెలుసుకున్న హరీష్‏కృష్ణ ముఖానికి ముసుగు, హెల్మెట్‌ ధరించి ఇజ్జత్‌నగర్‌లోని ఇంట్లోకి చొరబడి మణికంఠ భార్యను కత్తితో బెదిరించి, దాడి చేసి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను లాక్కెళ్లాడు. మణికంఠ(Manikanta) ఫిర్యాదు మేరుకు మాదాపూర్‌ పోలీసులు(Madhapur Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా హరీ్‌షకృష్ణ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి 20గ్రాముల బంగారు గాజులు, కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ డి.కృష్ణమోహన్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..

ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ వాసి మృతి

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 30 , 2025 | 07:31 AM