Khammam: తరగతి గదిలో కిందపడి గాయం.. చికిత్స పొందుతూ బాలిక మృతి
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:26 AM
సదరు బాలిక గుండెపోటుతో మరణించిందని పోలీసులు కేసు మార్చి రాశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించడం వివాదాస్పదమైంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన లో విద్యార్థిని పొట్ట శ్రావణి (14) బుధవారం మృతి చెందింది.

ఖమ్మం జిల్లాలో ఘటన
రఘునాథపాలెం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తరగతి గదిలో ఆడుకుంటూ కింద పడి గాయపడిన ఓ బాలిక.. మరుసటి రోజు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించింది. అయితే, సదరు బాలిక గుండెపోటుతో మరణించిందని పోలీసులు కేసు మార్చి రాశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించడం వివాదాస్పదమైంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన లో విద్యార్థిని పొట్ట శ్రావణి (14) బుధవారం మృతి చెందింది. రఘునాథపాలెం మండలం రేగులచెలకకు చెందిన పొట్ట నాగేశ్వరరావు, మరియమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. నాగేశ్వరరావు 13ఏళ్ల క్రితం ప్రమాదంలో మరణించగా నాటి నుంచి కూలిపనులు చేస్తూ మరియమ్మ కుమార్తెలను పెంచుతోంది. చిన్న కుమార్తె అయిన శ్రావణి కొయచెలక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే, ఈ నెల 25న తన స్నేహితులతో కలిసి తరగతి గదిలోని బల్లపై ఆడుకుంటుండగా శ్రావణి కింద పడింది. తల వెను క దెబ్బ తగిలి బొప్పి కట్టింది. మరుసటి రోజు శ్రావణికి వాంతులు, ఫిట్స్ రావటంతో తల్లి, తాత ఆమెను ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై శ్రావణి తాత వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తలకు గాయమైన విషయాన్ని దాచి.. శ్రావణి జ్వరం, గుండెపోటుతో మరణించిందని పోలీసులు కేసు రాశారని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి