AP News: ఎవరికీ భారం కాకూడదని...
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:49 PM
ఒకరినొకరు వదలలేని ప్రేమాను రాగాలు.. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం. 62 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. అలాంటి దంపతులను వృద్ధాప్య సమస్యలు వెంటా డాయి. ఇలాంటి సమస్యలతో నిత్యం బాధపడుతూ బిడ్డలకు భారం కాకూడద ని నిశ్చయించుకున్నారు.
- వృద్ధ దంపతుల ఆత్మహత్య
- చెన్నూరులో విషాదం
చెన్నూరు/సిద్దవటం(కడప): ఒకరినొకరు వదలలేని ప్రేమాను రాగాలు.. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం. 62 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. అలాంటి దంపతులను వృద్ధాప్య సమస్యలు వెంటా డాయి. ఇలాంటి సమస్యలతో నిత్యం బాధపడుతూ బిడ్డలకు భారం కాకూడద ని నిశ్చయించుకున్నారు. చివరికి తమ ఊరికి దూరంగా వెళ్లి పెన్నానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా..
చెన్నూరులోని పడమటివీధిలో నివాసం ఉంటున్న ఆవుల వెంకటసుబ్బయ్య (84), ఆవుల నాంచారమ్మ(82)లకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ వివాహాలయ్యాయి. ముగ్గురూ వేర్వేరు ఊర్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
వెంకటసుబ్బయ్య ఆరోగ్యంగా ఉన్నంత వరకు దినసరి కూలీగా వ్యవ సాయ పొలాల్లో పనిచేసేవాడు. కొంతకా లంగా ఆ దంపతులకు వృద్ధాప్య సమస్య లు ఎక్కువయ్యాయి. అనారోగ్య సమస్యలు తరచూ వెంటాడుతుండడంతో బిడ్డలను వైద్యానికి డబ్బులు అడగడం, వారిని ఇబ్బంది పెట్టడం ఎందునుకున్నారు. జీవి తం చాలిస్తే ఎవరికీ భారం ఉండదను కున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 3వ తేదీ బుధవారం ఉదయం 11గంటలకు ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనుంచి ఇద్దరూ వెళ్లిపో యారు.

తమ మరణానంతరం అవసర మైన ఖర్చులకు బిడ్డలు ఇబ్బంది పడకూ డదని.. బ్యాంకులో పొదుపు చేసుకున్న డబ్బులను, భార్య ముక్కు చెవుల్లోని వస్తువులు తీసి ఇంట్లోనే పెట్టారు. తల్లిదండ్రు లు కనిపించకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆ రోజంతా వెదికి చివరకు గురువారం చెన్నూరు పోలీస్‌స్టేషన్‌లో కుమారుడు మహేశ్ ఫిర్యాదు చేశారు. వృద్ధ దంపతుల ఆచూకీ కోసం చెన్నూరు సీఐ క్రిష్ణారెడ్డి విచారణ చేపట్టారు.
మాచుపల్లె వద్ద పెన్నానదిలో..
వృద్ధ దంపతులు ఇద్దరూ సిద్దవటం మండలం మాచుపల్లెలోని రేణుక యల్లమాంబ ఆలయం వద్ద గురువారం రాత్రి సు మారు 7గంటల వరకు ఉన్నారు. అమ్మ వారిని దర్శించుకుని కాసేపు అక్కడే విశ్రాంతి తీసున్నారు. తర్వాత నాంచారమ్మ పెన్నానదిలోకి దిగారు. కాసేపు అటు ఇటు తిరుగుతూ తడబడి చివరకు వెంక టసుబ్బయ్య కూడా పెన్నాలో దిగాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వీరిద్దరూ మునిగిపోయారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలలో ఈ వివరాలు నమోదయ్యాయి. పెన్నా ఒడ్డున నాంచారమ్మ పాదరక్షలు ఉండడంతో బంధువులు గుర్తించారు.
వీరి కుమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు సిద్దవటం పోలీసులు శుక్రవారం ఐదుగురు జాలర్ల సహాయంతో పెన్నాలో గాలింపు చర్యలు చేపట్టగా మాచుపల్లి సమీప ప్రాంతాల్లోని ముళ్ల పొదల్లో మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం మాచుపల్లె పెన్నా నది ఒడ్డునే రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీంతో వారి స్వగ్రామమైన చెన్నూరుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐలు నాయక్, బాబయ్య, హెడ్‌కానిస్టేబుల్ నాయక్, స్థానిక పోలీసు శివప్రసాద్ పాల్గొన్నారు.
ఎంత కష్టమొచ్చిందో వారికి..
ఆరోగ్యం సహకరించకపోయినా ఆ దంప తులు ఇద్దరూ ఆ ప్రాంతంలో అందరితో నూ కలుపుగోలుగా ఉండేవారు. ఎప్పుడూ సంతోషంగా మాట్లాడుతూ గడిపేవారు. అలాంటి వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ డంతో చెన్నూరువాసులంతా ఎంత కష్ట మొచ్చిందో ఈ వయసులో వారికి.. ఇలా నదిలో దిగి ఆత్మహత్యకు పాల్ప డ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
Read Latest Telangana News and National News