Share News

AP News: అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:33 PM

తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది.

AP News: అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు

- ధనుంజయ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ధర్మవరం(అనంతపురం): తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయ(Dhananjaya)ను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు శివయ్యను అరెస్టు చేశామని డీఎస్పీ హేమంత్‌కుమార్‌ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు తెలిపారు.


కేతిరెడ్డి కాలనీ ఎల్‌-2లో పాళ్యం శివయ్య, ఎల్‌-3లో అతని పిన్ని కుమారుడు పాళ్యం ధనుంజయ నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహంగా ఉంటూ మద్యం సేవించేవారు. శివయ్య భార్యతో ధనుంజయ చెడుగా ప్రవర్తించేవాడు. దీంతో శివయ్య(Shivayya) మందలించాడు. అయినా అతనిలో మార్పురాలేదు.


pandu1.2.jpg

దీంతో శివయ్య కక్ష పెంచుకుని పథకం ప్రకారం ఈ నెల 21వతేదీ అర్ధరాత్రి ఎల్‌పీ సర్కిల్‌లో బ్రిడ్జి కింద ధనుంజయను సిమెంట్‌ ఇటుకతో బాది చంపేశాడు. నిందితుడిని సీఐ నాగేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ కేతన్న, హెడ్‌ కానిస్టేబుళ్లు అప్పస్వామి, శివశంకర్‌, కానిస్టేబుళ్లు రాజప్ప, షాకీర్‌, బయన్న, సుధీర్‌కుమార్‌, రాజన్న శనివారం అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 24 , 2025 | 12:33 PM