Bengaluru News: మూటల్లో.. కాళ్లు, చేతులు.. అల్లుడే హంతకుడు
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:34 AM
ఇటీవల తుమకూరు జిల్లా కొరటగెరెలో లక్ష్మీదేవి అనే మహిళను ముక్కలుగా కత్తిరించి ప్లాస్టిక్ కవర్‌లలో వేసి పలుచోట్ల పడేసిన కేసును పోలీసులు చేధించారు. డెంటిస్ట్ అయిన అల్లుడే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. దంత వైద్యుడు రామచంద్రప్ప సహా అతడి సహచరులు ఇద్దరిని అరెస్టు చేశారు.
- మహిళ దారుణ హత్య కేసును ఛేదించిన పోలీసులు
- అల్లుడే కడతేర్చాడని నిర్ధారణ.. ముగ్గురి అరెస్ట్
బెంగళూరు: ఇటీవల తుమకూరు(Tumakuru) జిల్లా కొరటగెరెలో లక్ష్మీదేవి అనే మహిళను ముక్కలుగా కత్తిరించి ప్లాస్టిక్ కవర్‌లలో వేసి పలుచోట్ల పడేసిన కేసును పోలీసులు చేధించారు. డెంటిస్ట్ అయిన అల్లుడే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. దంత వైద్యుడు రామచంద్రప్ప సహా అతడి సహచరులు ఇద్దరిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ సోమవారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు కొరటగెరె పరిధిలోని కొళాలు గ్రామానికి వెళ్ళే రోడ్డు పొడవునా మహిళ శరీర భాగాలతో ఉన్న ఏడు ప్లాస్టిక్ సంచుల్లో 19 ముక్కలుగా ఉండే భాగాలను ఈనెల 7న గుర్తించిన కొరటగెరె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతురాలిని లక్ష్మీదేవి(42)గా గుర్తించారు. తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్ కేవీ నేతృత్వంలో దర్యాప్తు జరిపిన పోలీసులు దంతవైద్యుడిగా కొనసాగిన అల్లుడు రామచంద్రప్ప ప్రమేయంపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా హత్య చేసినట్లు అంగీకరించారు. మిత్రులు సతీష్, కిరణ్‌లతో కలిసి దారుణానికి పాల్పడినట్లు అంగీకరించారన్నారు. లక్ష్మీదేవి రెండో కుమార్తెను డాక్టర్ రామచంద్ర 19 ఏళ్ళ కిందట పెళ్ళి చేసుకున్నారు. ఇది రామచంద్రకు రెండోవివాహం. లక్ష్మీదేవి వ్యవహరిస్తున్న విధానంపై అల్లుడు రామచంద్రకు అసంతృప్తి ఉండేది. భార్యను అత్త చెడగొడుతున్నారని భావించి తీవ్రమైన కోపంతో ఉండేవారు.

ఈనెల 7న నగరానికి వచ్చిన లక్ష్మీదేవిని కారులో వదిలిపెట్టి వస్తానంటూ డాక్టర్ రామచంద్ర తీసుకెళ్ళారు. కొరటగెరెలోనే ఆమెను హత్య చేసి ఆతర్వాత సతీష్ కు చెందిన తోటకు తీసుకెళ్ళి 19 ముక్కలుగా చేసి 7 ప్లాస్టిక్ సంచుల్లోకి నింపి రోడ్డుపక్కన పడేశారు. లక్ష్మిదేవిని కారులో ఎక్కించుకుని నగరమంతా తిరిగినట్లు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. అనుమానం కలిగిన కారు సతీష్ పేరుతోనే ఉంది. లక్ష్మీదేవి హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News