Share News

Chennai News: పాలిటెక్నిక్‌ కళాశాలలో పేలిన నాటుబాంబు

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:29 AM

తూత్తుకుడి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓ విద్యార్థి తీసుకొచ్చిన నాటు బాంబు పేలడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుచెందూరు సమీపం ఆరుముగనేరి ప్రాంతానికి చెందిన వెంకటేష్‌ ఆ కళాశాలలో మెకానికల్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం వెంకటేష్‌ తన స్నేహితుడి ఊరిలో జరిగిన ఆలయ ఉత్సవాలకు వెళ్ళాడు.

Chennai News: పాలిటెక్నిక్‌ కళాశాలలో పేలిన నాటుబాంబు

- ఇద్దరు విద్యార్థులకు గాయాలు

చెన్నై: తూత్తుకుడి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల(Polytechnic College)లో ఓ విద్యార్థి తీసుకొచ్చిన నాటు బాంబు పేలడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుచెందూరు సమీపం ఆరుముగనేరి ప్రాంతానికి చెందిన వెంకటేష్‌ ఆ కళాశాలలో మెకానికల్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం వెంకటేష్‌ తన స్నేహితుడి ఊరిలో జరిగిన ఆలయ ఉత్సవాలకు వెళ్ళాడు. ఆ ఉత్సవాల్లో నాటుబాంబులు తయారు చేసి పేల్చటాన్ని గమనించాడు.


అతడి వద్ద ఓ నాటు బాంబు అడిగి తీసుకుని తన సంచిలో ఉంచుకుని స్వస్థలానికి చేరుకున్నాడు. మంగళవారం ఉదయం ఆ నాటుబాంబున్న సంచిలోనే పుస్తకాలు పెట్టుకుని వెంకటేష్‌ కళాశాలకు వచ్చాడు. తరగతిగదిలోకి వెళ్ళిన తర్వాత వెంకటేష్‌ అదే పనిగా సంచిలోని నాటుబాంబును ఆసక్తి గమనిస్తుండడం చూసిన తోటి విద్యార్థులు మాధవన్‌, మురళికార్తీక్‌ ఆ సంచిని లాక్కుని అందులోని నాటుబాంబును చేతుల్లోకి తీసుకుని ఆటలాడారు. వెంకటేష్‌ నాటు బాంబును తీసుకునేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోలేదు.


ఆలోగా విద్యార్థులు సంచిని లాగుతుండటంతో నాటుబాంబు వత్తిపై ఒత్తిడి పెరిగి అది పేలింది. ఈ సంఘటనలో మాధవన్‌ కుడిచేయికి, మురళికార్తీక్‌ కంటి దిగువన గాయాలయ్యాయి. నాలుబాంబు పేలుడు శబ్దం విని విద్యార్థులు, అధ్యాపకులు భీతిల్లారు. ఆ తర్వాత గాయపడిన ఇద్దరు విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తెన్‌పాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని తీవ్ర విచారణ జరుపుతున్నారు. ఆ కళాశాలలో బాంబు పేలిందని తెలియటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు చేరారు. చివరకు ఆ నాటుబాంబు బాణసంచా రకానికి చెందినదని తెలియటంతో ఊరట చెందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడేది లేదు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2025 | 11:29 AM