Share News

Chennai News: మరణంలోనూ వీడని ‘స్నేహం’..

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:55 AM

మరణం కూడా వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, ఆ విషయం తెలిసి అతని స్నేహితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుప్పూర్‌ జిల్లాలో గురువారం జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

Chennai News: మరణంలోనూ వీడని ‘స్నేహం’..

- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- తట్టుకోలేక స్నేహితుడి బలవన్మరణం

చెన్నై: మరణం కూడా వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, ఆ విషయం తెలిసి అతని స్నేహితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుప్పూర్‌(Tiruppur) జిల్లాలో గురువారం జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలిలా... మనకడవు గ్రామానికి చెందిన కార్మికుడు కార్తికేయన్‌ కుమారుడు వీరకుమార్‌ (18) ఇటీవలే ఉద్యోగంలో చేరాడు.


nani1.jpg

అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు ధనశేఖర్‌ (18) పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం కొత్తగా బైక్‌ కొన్న వీరకుమార్‌ ధనశేఖర్‌తో కలసి తారాపురంలోని ఆలయానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం వారు బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రాత్రి 7 గంటల సమయంలో తారాపురం-పళని రోడ్డులో వీరి బైక్‌ను, వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది.


nani1.2.jpg

ఈ ఘటనలో ఇద్దరూ కిందపడగా, వీరకుమార్‌ తలకు బలమైన గాయమైంది. చుట్టుపక్కల వారు వీరకుమార్‌ను తారాపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతిచెందాడు. స్నేహితుడి మృతి తట్టుకోలేని ధనశేఖర్‌.. తన ఇంటికెళ్లి అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2025 | 11:55 AM