Share News

Chennai News: ఛత్తీస్‏గఢ్‌లో వరదకు ఇంజనీరు కుటుంబం బలి

ABN , Publish Date - Aug 29 , 2025 | 09:54 AM

ఛత్తీస్‏గఢ్‌ రాష్ట్రంలో సంభవించిన వరద విపత్తులో తిరుపత్తూర్‌ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పారండపల్లి గ్రామానికి చెందిన రాజేష్‏కుమార్‌ (45) 15 ఏళ్లుగా ఛత్తీస్‏గఢ్‌లో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

Chennai News: ఛత్తీస్‏గఢ్‌లో వరదకు ఇంజనీరు కుటుంబం బలి

చెన్నై: ఛత్తీస్‏గఢ్‌ రాష్ట్రంలో సంభవించిన వరద విపత్తులో తిరుపత్తూర్‌ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పారండపల్లి గ్రామానికి చెందిన రాజేష్‏కుమార్‌ (45) 15 ఏళ్లుగా ఛత్తీస్‏గఢ్‌లో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కార్యాలయం రాయపూర్‌ జిల్లా జగత్‌పూర్‌లో ఉండగా, సమీపంలోనే భార్య పవిత్ర (38), కుమార్తెలు సత్య (8), సామిక (6)లతో కలసి నివసిస్తున్నారు. ఇటీవల తిరుపతి ఆలయంలో జరిగిన బంధువుల శుభకార్యక్రమంలో పాల్గొన్న రాజేష్‌ కుమార్‌(Rajesh Kumar) కుటుంబం కారులో ఛత్తీస్ గఢ్‌కు బయలుదేరింది.


nani1.jpg

వాహనం బుధవారం రాయపూర్‌ సమీపంలోని పండర్‌ఛందన మీదుగా వెళ్తుండగా హఠాత్తుగా వచ్చిపడిన వరద ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులో చిక్కుకున్న నలుగురు ఊపిరాడక మృతిచెందారు. రుక్‌మా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు నుంచి మృతదేహాలు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్గం అనంతరం నలుగురి మృతదేహాలు స్వగ్రామానికి పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..

4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2025 | 09:54 AM