Tirupati: ప్రహరీ దూకి.. సీసీ కెమెరాలు పగులకొట్టి
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:37 AM
ప్రహరీ దూకారు. ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలు పగులకొట్టారు. టీటీడీ (తిరుమల వైకుంఠం-1) సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఇంట్లో దొంగలు పడి 220 గ్రాముల బంగారు నగలు, 460 గ్రాముల వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు.
- టీటీడీ సూపరింటెండెంట్ ఇంట్లో చోరీ
- 220 గ్రాముల నగలు, 460 గ్రాముల వెండి వస్తువుల అపహరణ
తిరుపతి: ప్రహరీ దూకారు. ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలు పగులకొట్టారు. టీటీడీ (తిరుమల వైకుంఠం-1) సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఇంట్లో దొంగలు పడి 220 గ్రాముల బంగారు నగలు, 460 గ్రాముల వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు. తిరుపతి క్రైం సీఐ ప్రకాష్ బాబు తెలిపిన ప్రకారం.. తిరుపతి బైరాగిపట్టెడలో నివాసం ఉంటున్న టీటీడీ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఈనెల 14న హైదరాబాదులోని కుమార్తె ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్లారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఇంటికి రాగా.. తాళాలు పగులకొట్టి ఉన్నాయి.
ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో అనుమానం వచ్చింది. బీరువాలో చూడగా బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ గిరిధర్, క్రైం సిబ్బంది సంఘటనా స్థలం పరిశీలించారు. క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావుకు సమాచారం ఇచ్చారు. క్రైం డీఎస్పీ శ్యాంసుందర్, సీఐలు చిన్నపెద్దయ్య, ప్రకా్‌షబాబు, ఐడీ పార్టీలు, వేలి ముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్‌లు ఇంట్లో పరిశీలించాయి. వేలి ముద్రలు సేకరించారు.
ఇంట్లోనే బీరువా తాళాలు
హైదరాబాదు(Hyderabad)కు వెళ్లే సమయంలో శ్రీనివాసులు కుటుంబీకులు రెండు బీరువాలకు తాళాలు వేసి అక్కడే ఉంచారు. దీంతో దొంగలు ఆ తాళాలు తీసుకుని బీరువా తలుపులు తీసి 220 గ్రాములు బంగారు నగలు, 460 గ్రాములు వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు. ఆ తాళాలూ తమతో పాటే వారు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి వద్ద సీసీ కెమెరాలు పగులకొట్టినా, వీధిలోని సీసీ కెమెరాల ఆధారంగా క్రైం పోలీసులు ఫుటేజీలను పరిశీలించారు. దొంగలు ఆటోలో వచ్చి.. వెళ్ళినట్లు గుర్తించారు. నిందితుల ముఖాలు గుర్తు పట్టినట్లు విశ్వసనీయ సమాచారం. క్రైం పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
Read Latest Telangana News and National News