AP News: దారుణం.. హత్య చేసి.. కాల్చేశారు..
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:25 PM
యువకుడిని హత్యచేసి కాల్చేసిన ఘటన శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని సంతేబిదనూరు వద్ద జరిగింది. రూరల్ సీఐ జనార్దన్ తెలిపిన మేరకు సంతేబిదునూరు సమీపంలో కల్లుదుకాణం నిర్వహించే ప్రాంతంలో కాల్చివేసిన శవం ఉందని సోమవారం తెలిసిందన్నారు.
హిందూపురం(అనంతపురం): యువకుడిని హత్యచేసి కాల్చేసిన ఘటన శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం(Hindupur) మండలంలోని సంతేబిదనూరు వద్ద జరిగింది. రూరల్ సీఐ జనార్దన్ తెలిపిన మేరకు సంతేబిదునూరు సమీపంలో కల్లుదుకాణం నిర్వహించే ప్రాంతంలో కాల్చివేసిన శవం ఉందని సోమవారం తెలిసిందన్నారు. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించామన్నారు. హత్యచేసి మృతుడిని గుర్తుపట్టకుండా ఉండటం కోసం ఖాళీ వాటర్ బాటిల్ వేసి నిప్పంటించినట్లు తెలిపారు.

దీంతో మొహం మాత్రం కాలిపోయిందన్నారు. కల్లుదుకాణ నిర్వాహకుడిని ప్రశ్నించగా మృతుడు కర్ణాటక(Karnataka)కు చెందినవాడని తెలిపాడు. దీంతో గౌరీబిదునూరు(Goweibidnur) పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతెడె గౌరీబిదునూరులోని హనుమంతనగర్‌కు చెందిన పవన్‌కుమార్ (28)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తుపట్టారు. దీనిపై కేసు నమోదుచేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
Read Latest Telangana News and National News