Hyderabad: అశోకా హోటల్‌కు బాంబు బెదిరింపు..
ABN , Publish Date - Feb 28 , 2025 | 08:44 AM
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) ఎదురుగా ఉన్న హోటల్‌లో బాంబు పెట్టానని, కాసేపట్లో పేలుతుందని పోలీస్ కంట్రోల్ రూమ్(Police control room)కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. పోలీసులు హోటల్‌లో విస్తృత తనిఖీ చేసి బాంబు లేదని గోపాలపురం పోలీసులు నిర్ధారించారు.
- అర్ధరాత్రి వేళ విస్తృత తనిఖీలు
- ఫేక్‌కాల్‌గా నిర్ధారించిన పోలీసులు
- అబిడ్స్‌లో పట్టుబడిన అజ్ఞాత వ్యక్తి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) ఎదురుగా ఉన్న హోటల్‌లో బాంబు పెట్టానని, కాసేపట్లో పేలుతుందని పోలీస్ కంట్రోల్ రూమ్(Police control room)కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. పోలీసులు హోటల్‌లో విస్తృత తనిఖీ చేసి బాంబు లేదని గోపాలపురం పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విద్యుత్‌కు భారీ డిమాండ్.. ఆ మూడు సర్కిళ్లలోనే అధికం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న అశోకా హోటల్‌లో బాంబు పెట్టానని బుధవారం అర్ధరాత్రి తర్వాత 2.30 గంటలకు ఓ ఆజ్ఞాత వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. కంట్రోల్‌రూం పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన ఏసీపీ సుబ్బయ్య, ఇన్‌స్పెక్టర్ నరేష్, ఎస్సై దయాకర్, వేణుగోపాల్‌లతోపాటు ఎస్సైలు పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందం హోటల్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు. బాంబు లేదని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అబిడ్స్‌లో పట్టుబడిన నిందితుడు
హోటల్‌లో బాంబు పెట్టానని బెదిరించిన వ్యక్తి పెద్దపల్లికి చెందిన మోహిజా అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా అబిడ్స్‌లోని ఓ లాడ్జిలో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఎవరీ మోహిజా అహ్మద్?
పెద్దపల్లికి చెందిన మోహిజా అహ్మద్ కొంతకాలంగా మతిస్థిమితం తప్పి బాధపడుతున్నాడు. పదేపదే హైదరాబాద్ పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి ఉత్తుత్తిగా బెదిరింపు ఫోన్లు చేస్తున్నట్లు గుర్తించారు. బుధవారం సెల్‌ఫోన్ నుంచి గూగుల్‌లో వెతుకుతుండగా హోటల్ పేరు కనిపించడంతో వెంటనే బెదిరింపు కాల్ చేసినట్లు గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
Read Latest Telangana News and National News