Share News

Bengaluru News: ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 29 , 2025 | 01:55 PM

కొప్పళ జిల్లాలో ఇద్దరు పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం కుకనూరు పోలీస్‏స్టేషన్‌ పరిధిలో బెణకల్‌ గ్రామంలో లక్ష్మి భజంత్రి (30), పిల్లలు రమేశ్‌ (3), జానవి(2)లను హతమార్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

Bengaluru News: ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య

బెంగళూరు: కొప్పళ జిల్లాలో ఇద్దరు పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం కుకనూరు పోలీస్‏స్టేషన్‌(Kukanoor Police Station) పరిధిలో బెణకల్‌ గ్రామంలో లక్ష్మి భజంత్రి (30), పిల్లలు రమేశ్‌ (3), జానవి(2)లను హతమార్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలు కారణమై ఉంటాయని భావించారు. అయితే మృతురాలు లక్ష్మి తల్లి బసవ్వ ఆరోపణలతో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన బీరప్ప అనే వ్యక్తితో లక్ష్మికి వివాహేతరసంబంధం ఏర్పడిందని,


pandu3.2.jpg

అతడి ఒత్తిడిని తట్టుకోలేక కొన్ని నెలలకాలంగా ఇబ్బంది పడుతున్నట్టు ఆరోపించారు. భర్త పిల్లలను వదిలిపెట్టి వచ్చేయాలని, ఇద్దరం కలసి కాపురం చేద్దామని బీరప్ప వేధించాడని అదే మానసికంగా ఇబ్బంది కలిగి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. తొలుత ఇద్దరి పిల్లలను ఉరి వేసి హతమార్చిన తర్వాత లక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లా ఎస్పీ డాక్టర్‌ రామ్‌ ఎల్‌ అరసిద్ది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో భారీగా తగ్గుదల

భయపెడుతున్న మొంథా తుఫాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2025 | 01:55 PM