Bengaluru: కూతురి హత్య.. ప్రతీకారంతో..
ABN , Publish Date - May 08 , 2025 | 12:24 PM
ఓ వివాదం రెండు కుటుంబాల మధ్య పెద్ద అగాదాన్నే నింపింది. అది ఎంతవరకంటే ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. నా కుమార్తెను హతమార్చి, నీ కుమార్తెకు పెళ్లి ఎలా చేస్తావో అంటూ అతడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- దారి కాచి నిందితుడి తండ్రిని కడతేర్చిన వైనం
బెంగళూరు: మండ్య జిల్లాలో టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతి హత్యకు ఆమె తండ్రి ప్రతీకార హత్య చేశాడు. హత్యకేసు నిందితుడి తండ్రి నరసింహగౌడను బుధవారం దారికాచి, వెంకటేశ్ అనే వ్యక్తి చంపేశాడు. పోలీసులు తెలిపిన మేరకు, మండ్య జిల్లా పాండవపుర తాలూకా మాణిక్యనహళ్ళికి చెందిన దీపిక 2024 జనవరిలో మేల్కోటె యోగానరసింహస్వామి ఆలయం వెనుకభాగాన హత్యకు గురయ్యింది. దీపిక ఫోన్‌లో చివరికాల్ నితీశ్‌ది ఉండడంతో, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: చోరీ కోసం వెళ్లి చంపేశాడు..
నితీశ్ అరెస్టు కాగా ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. నితీశ్ అక్కకు ఈనెల 11న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులంతా బిజీగా ఉన్నారు. దీపిక తండ్రి వెంకటేశ్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నితీశ్ తండ్రి నరసింహగౌడ గ్రామంలో ఒంటరిగా నడిచి వెళ్తుండగా ఒక్కసారిగా వెంకటేశ్ చాకుతో విచక్షణా రహితంగా పొడిచారు. నా కుమార్తెను హతమార్చి, నీ కుమార్తెకు పెళ్లి ఎలా చేస్తావో అంటూ వెంకటేశ్ దూషించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో నరసింహగౌడ అక్కడికక్కడే మృతి చెందాడు.
మేల్కోటె పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారైన వెంకటేశ్‌కోసం గాలింపు చేపట్టారు. నితీశ్, దీపిక స్నేహితులుగా ఉండేవారు. దీపిక భర్తతోపాటు కుటుంబీకులు నితీశ్‌తో స్నేహం ఏంటని ప్రశ్నించేవారు. తమ్ముడిలాంటివాడని దీపిక దాటవేసేది. ఇలా కుటుంబంలో వివాదం రావడంతో కొంతకాలం వారిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. 2024 జనవరి 22న నితీశ్ బర్త్‌డే ఉండడంతో మేల్కోటె కొండ వద్ద ఇద్దరూ కలిశారు.
నితీశ్‌కు బహుమతిగా ఓ షర్టును దీపిక తీసుకెళ్లింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఆ మరుసటి రోజు ఆలయం వెనుకభాగాన దీపిక మృతదేహం బయటపడింది. దీపిక కుటుంబసభ్యులు నితీశ్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్టు చేశారు. నరసింహగౌడ్ మృతితో నితీశ్ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..
Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత
Operation Sindoor: సిందూరమే.. సంహారమై
CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు
Read Latest Telangana News and National News