Bengaluru News: భార్యను చంపి.. రెండు రాత్రులు మృతదేహంతోనే..
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:15 PM
భార్యను చంపిన భర్త రెండు రోజులు మృతదేహాన్ని దగ్గరే ఉంచుకున్నారు. తరలించే ప్రయత్నం ఫలించక పరారీ అయ్యారు. బెళగావి జిల్లా మూడలగి తాలూకా కమలదిన్ని గ్రామంలో ఘటన గురువారం వెలుగు చూసింది.
బెంగళూరు: భార్యను చంపిన భర్త రెండు రోజులు మృతదేహాన్ని దగ్గరే ఉంచుకున్నారు. తరలించే ప్రయత్నం ఫలించక పరారీ అయ్యారు. బెళగావి(Belagavi) జిల్లా మూడలగి తాలూకా కమలదిన్ని గ్రామంలో ఘటన గురువారం వెలుగు చూసింది. సాక్షి కంబారను మే 24న ఆకాశ్ కంబార పెళ్లి చేసుకున్నాడు. హుబ్బళ్ళిలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆకాశ్ తనకు లక్ష రూపాయలు జీతం అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
50 గ్రాముల బంగారం, రూ.5లక్షల నగదు కోసం వేధించేవాడని ఈ కారణంగానే భార్యను చంపేశాడంటూ సాక్షి కుటుంబీకులు మూడలగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతానికి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఆకాశ్‌కోసం గాలింపు చేపట్టారు. సాక్షి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం భార్యను గొంతు నులిమి ఆకాశ్ చంపాడన్నారు. అనంతరం మృతదేహాన్ని బెడ్‌రూంలోని మంచం బాక్స్‌లో వేసి, తన తల్లికి ఫోన్ చేసి తామిద్దరం గోకాక్ వెళ్లి వస్తామని చెప్పాడన్నారు. ఆకాశ్ తల్లి యల్లమ్మదేవి సేవ చేస్తుండడంతో ఆమె ఆలయంలోనే బస చేసేది. మంగళవారం ఆకాశ్ తల్లి ఇంట్లో ఏదో వాసన వస్తోందని చెప్పగా ఆమెకు అబద్ధం చెప్పి ఏమార్చాడు.
ఇలా రెండు రోజులు భార్య మృతదేహం తోనే ఆకాశ్ నిద్రించాడు. అయితే ఆమె మృతదేహం తరలించడం సాధ్యం కాదని గుర్తించి పరారయ్యాడు. చివరకు బెడ్‌రూం నుంచి దుర్వాసన అధికంగా వస్తుండడంతో ఆకాశ్ తల్లి పరిశీలించగా మంచం కింద మృతదేహం ఉన్నట్టు గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News