AP News: మాటల్లో పెట్టి.. మాయ..
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:36 AM
బస్టాండ్‌లలో తిష్ట వేస్తారు. ఆభరణాలతో ప్రయాణించే మహిళలను గుర్తించి.. వారు ఎక్కే బస్సులో ఎక్కేస్తారు. మాటల్లో పెట్టి.. మాయ చేసేస్తారు. సొమ్మంతా కాజేసి మాయమైపోతారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కేంద్రానికి చెందిన నలుగురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి.. చోరీలు, దోపిడీలకు తెగబడుతున్నారు.
- బస్సుల్లో చోరీ చేసే మహిళల ముఠా అరెస్టు
- రూ.23 లక్షల విలువైన బంగారం ఆభరణాలు స్వాధీనం
అనంతపురం: బస్టాండ్‌లలో తిష్ట వేస్తారు. ఆభరణాలతో ప్రయాణించే మహిళలను గుర్తించి.. వారు ఎక్కే బస్సులో ఎక్కేస్తారు. మాటల్లో పెట్టి.. మాయ చేసేస్తారు. సొమ్మంతా కాజేసి మాయమైపోతారు. చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam) నియోజకవర్గ కేంద్రానికి చెందిన నలుగురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి.. చోరీలు, దోపిడీలకు తెగబడుతున్నారు. వీరిని రాయదుర్గం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.23 లక్షల విలువైన 242.5 గ్రాముల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కమ్యూనిటీ హాల్‌లో ఎస్పీ జగదీష్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, ఈ కేసు వివరాలను వెల్లడించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన సుమ తి(46), గీత(37), రంజిత (33), బృంద(27) సమీప బంధువులు, రక్త సంబంధీకులు. ఈ ముఠాలో సుమతి కీలకం. పూసలు, రోల్డ్ గోల్డ్ నగల వ్యాపారం వీరి వృత్తి. కానీ ఈ ముసుగులో చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. గత ఏడాది కణేకల్లు బస్టాండ్‌లో ఓ మహిళ తన బంగారం ఆభరణాలను జాగ్రత్తగా పెట్టుకోవడం చూశారు. ఆమె ఎక్కిన బస్సులోనే ప్రయాణం చేశారు. ఆమెతో మాటలు కలిపి ఏమార్చారు. ఆమె కళ్లు గప్పి బ్యాగ్‌లో ఉన్న 70 గ్రాముల బంగారం లాంగ్ చైన్, 50 గ్రాముల బంగారం నెక్లె్‌సను తస్కరించి మాయమైపోయారు. ఈ నెల 23వ తేదీ కళ్యాణదుర్గం బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఓ ప్రయాణికురాలిపై నిఘా వేశారు.

ఆమెను ఎక్కిన బస్సునే ఎక్కారు. ఆమె కణేకల్లు క్రాస్ వద్ద బస్సు దిగబోతుండగా, పథకం ప్రకారం అడ్డుగా నిలిచారు. దీంతో బస్సు స్టాప్ దాటి కొంత దూరం వెళ్లింది. ఎవరూ లేనిచోట ఆగింది. అక్కడ ఆమెతోపాటు ఈ ముఠా దిగింది. బృంద కత్తి తీసుకుని ఆ మహిళను బెదిరించింది. మిగిలినవారు ఆమె వద్ద ఉన్న 107.5 గ్రాముల లాంగ్‌చైన్, గాజులు, డాలర్ చైన్, ఉంగరం, కమ్మలను బంగారు ఆభరణాలను లాక్కున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎస్పీ ఆదేశాలతో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్‌ఐ నాగమధు, బొమ్మనహాళ్‌ఎ్‌సఐ నబీరసూల్ రంగంలోకి దిగారు. కణేకల్లు మండలం యర్రగుంట క్రాస్ వద్ద ఈ ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.23 లక్షల విలువైన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన రాయదుర్గం రూరల్ సీఐ, కణేకల్లు, బొమ్మనహాళ్ ఎస్‌ఐ, పీఎ్‌సఐ నారాయణరెడ్డిని ఎస్పీ అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News