Share News

Hyderabad: యువకుడి కిడ్నాప్‌, దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్‌

ABN , Publish Date - Jan 23 , 2025 | 10:53 AM

స్నేహితులతో బైక్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని ఆగంతకులు అడ్డగించి కిడ్నాప్‌ చేసి చీకటి ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాది రూ.1500 నగదు, ఫోన్‌, వాచ్‌ దోచుకున్న ఘటనలో ఆరుగురిపై సైదాబాద్‌ పోలీసులు(Saidabad Police) కేసు నమోదు చేశారు.

Hyderabad: యువకుడి కిడ్నాప్‌, దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్‌

- పరారీలో మరో ముగ్గురు

హైదరాబాద్: స్నేహితులతో బైక్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని ఆగంతకులు అడ్డగించి కిడ్నాప్‌ చేసి చీకటి ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాది రూ.1500 నగదు, ఫోన్‌, వాచ్‌ దోచుకున్న ఘటనలో ఆరుగురిపై సైదాబాద్‌ పోలీసులు(Saidabad Police) కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా మరో ము గ్గురు పరారీలో ఉన్నట్లు సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌(Saidabad Inspector Raghavendra) తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రతిష్టాత్మక నిర్ణయాలు..


నల్గొండ జిల్లా నాంపల్లి మండలం, తుంగపాడు గ్రామానికి చెందిన పుల్కారం నరేష్‌(23), చింతపల్లి గ్రామానికి చెందిన మణికాంత్‌, బంధువు మహే్‌షలు సోమవారం సంతోష్‌నగర్‌ ఫిసల్‌బండలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. అనంతరం చిన్ననాటి స్నేహితురాలిని కలిసేందుకు సైదాబాద్‌ కాలనీకి రాత్రి 8గంటల సమయంలో వచ్చి జ్యూస్‌ సెంటర్‌ వద్ద కలిశారు. స్నేహితురాలు వీరితో కొద్దిసేపు మాట్లాడి వెళ్లింది. అనంతరం మహేష్‌ బైక్‌ నడుపుతుండగా మణికాంత్‌, నరేష్‏(Manikanth, Naresh)లు వెనుక కూర్చొని పయనమయ్యారు.


కొంతదూరం వెళ్లగానే రెండు బైకులపై వెంబడించిన గుర్తు తెలియని నలుగురు యువకులు వీరిని అడ్డగించి బూతులు తిడుతూ అడ్డగించారు. ఈ క్రమంలో మహేష్‌, మణికాంత్‌ బైక్‌పై పారిపోగా నరేష్‌ వారికి చిక్కాడు. అతడిని పట్టుకున్న ఆగంతకులు వారి బైక్‌పై కూర్చోపెట్టుకుని చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ మరికొందరు యువకులు కూర్చొని ఉన్నారు. వారంతా కలిసి నరేష్‏ను చితకబాది అతడి వద్దనున్న రూ.1500 నగదు, ఫోన్‌, వాచ్‌ లాకున్నారు. ఇంకా రూ.5వేలు కావాలని డిమాండ్‌ చేశారు.


తన వద్ద లేవని బతిమాలాడు. నరేష్‌ ఫోన్‌ నుంచి మణికాంత్‌కు ఫోన్‌చేసి వదిలివేయాలంటే రూ.5వేలు ఆన్‌లైన్‌ చేయాలని బెదిరించారు. తాను ఇవ్వలేనని మణికాంత్‌ చెప్పడంతో నరేష్‏ను హెచ్చరించి విడిచిపెట్టారు. దీంతో బాధిత యువకుడు సైదాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు శంకేశ్వర్‌ బజార్‌కు చెందిన మహ్మద్‌ ఒవైన్‌(27), లోకాయుక్తా కాలనీకి చెందిన పవన్‌ సాయి శ్రీనిధి(24), సైదాబాద్‌కు చెందిన మహ్మద్‌ రాజీ హైదర్‌(27)లను అరెస్ట్‌ చేయగా మహేష్‌, రోహిత్‌, రియాన్‌లు ఫరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు

ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2025 | 10:53 AM