Business Idea: రాళ్లకు రంగులు రాస్తే రూపాయల వర్షం.. ఇదీ నయా ట్రెండ్!
ABN , Publish Date - Dec 04 , 2025 | 07:11 AM
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని ఊరికే చెప్పారా.. ఇది అక్షర సత్యమని ఎన్నో సందర్భాల్లో రుజువైన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న రాయితోనే ఐదు వేల రూపాయలు సంపాదించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 4: రోడ్డు పక్కన పడి ఉన్న రాళ్లలోనే రత్నాలను చూశాడా యువకుడు. తన బ్రెయిన్ కు పదునుపెట్టి అదే బిజినెస్ టెక్నిక్‌గా మార్చుకున్నాడు. రాయికి రంగు వేసి, అందులో చిన్న గడియారం అమర్చి రూ.5000కి అమ్మాడా యువకుడు. మెదడుకు పనిచెప్పి.. కొంచెం శ్రమపడి ఐదు వేల రూపాయలు సంపాదించుకున్నాడు.
ఢిల్లీకి చెందిన ఒక యువకుడు చేసిన పని ఇది. ఇప్పుడితని ఐడియా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెట్టింట్లో వైరల్ అవుతోంది. సదరు యువకుడు రోడ్డు పక్కనుంచి తీసుకున్న ఒక సాధారణ రాయిని అందంగా మలిచి, పాలిష్ చేసి, మంచి ఆకారాన్ని సృష్టించి, ఆపై పెయింట్ వేసి నిగనిగలాడే ఫినిషింగ్ తెచ్చాడు. తర్వాత రాయి లోపల ఒక చిన్న గడియారాన్ని అమర్చి దాన్ని అలంకార వస్తువుగా మార్చేశాడు.
మార్కెట్లో నిలబడి ఆ కళాకృతిని బేరానికి పెట్టాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా, తర్వాత వెనుకభాగాన్ని కూడా అందంగా తీర్చిదిద్ది చివరికి ఐదు వేల రూపాయలకి అమ్మేశాడు. ఒక్క రాయి.. రెండు బ్రష్ స్ట్రోక్స్.. వెరసి 5000 రూపాయల లాభం. ఒక చిన్న ఆలోచన, కొంచెం సృజనాత్మకత ఉంటే.. సాధారణ వస్తువులను కూడా అద్భుతమైన బిజినెస్ అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో నిరూపించాడా యువకుడు. ఈ క్రతువును సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తే.. ఆ వీడియా ఇప్పుడు వైరల్‌గా అయింది.
ఇవీ చదవండి:
రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..
జనరిక్ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌కు గ్రీన్ సిగ్నల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి