Share News

Budget 2025: బడ్జెట్ 2025 శనివారం రోజు స్టాక్ మార్కెట్ తెరిచే ఉంటుందా లేదా..

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:36 PM

కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న అంటే శనివారం రోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రోజున స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందా లేదా పనిచేస్తాయా అనే విషయాలను ఇక్కడ చూద్దాం..

Budget 2025: బడ్జెట్ 2025 శనివారం రోజు స్టాక్ మార్కెట్ తెరిచే ఉంటుందా లేదా..
Stock Market Open or not Budget 2025 Saturday

2025 కేంద్ర బడ్జెట్ ఈసారి శనివారం, ఫిబ్రవరి 1న ఉంటుంది. ఈ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే ఈ బడ్జెట్ రోజు శనివారం అయిన క్రమంలో స్టాక్ మార్కెట్లు ఉంటాయా లేదా అనే ప్రశ్న వచ్చింది. సాధారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తాయి. శని, ఆదివారాలు బంద్ ఉంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజు శనివారం వచ్చింది. ఈ క్రమంలో ప్రత్యేక సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తెరిచే ఉంటాయని అధికారులు ప్రకటించారు.


ఈ సారి ట్రేడింగ్ సెషన్ కూడా..

2025 కేంద్ర బడ్జెట్ సందర్భంగా శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ క్రమంలో ఈక్విటీ మార్కెట్లు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సాధారణ రోజుల మాదిరిగానే పనిచేస్తాయి. అలాగే కమోడిటీ డెరివేటివ్ మార్కెట్లు సాయంత్రం 5:00 గంటల వరకు పొడిగించబడతాయి. ప్రతి ట్రేడింగ్ రోజు మాదిరిగానే శనివారం కూడా ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ ఉదయం 9:00 నుంచి 9:08 వరకు జరుగుతుంది. తర్వాత సాధారణ మార్కెట్ గంటలు అమల్లో ఉంటాయి. ఇదే కాకుండా T0 సెషన్ సెలవు కారణంగా ఉండదు. జనవరి 31న జరిగే లావాదేవీలు సోమవారం, ఫిబ్రవరి 3న పరిష్కరించబడతాయి.


ప్రత్యక్ష ట్రేడింగ్ సెషన్‌..

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX) కూడా ఈ రోజున బడ్జెట్ ప్రకటనతో అనుగుణంగా ప్రత్యక్ష ట్రేడింగ్ సెషన్‌లను నిర్వహించనుంది. MCX ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సాధారణ ట్రేడింగ్‌ను అందిస్తుంది. ఇది మార్కెట్లో పాల్గొనే వారికి రియల్-టైమ్ రిస్క్ మేనేజ్‌మెంట్, హెడ్జింగ్ అవసరాలకు సహాయం చేస్తుంది. అయితే ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. 2020 ఫిబ్రవరి 1 (శనివారం), 2015 ఫిబ్రవరి 28న (శనివారం) బడ్జెట్ సందర్భంలో కూడా స్టాక్ మార్కెట్లు తెరిచిన సందర్భాలు ఉన్నాయి.


గత బడ్జెట్ సందర్భంగా..

గత 2024 బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్లు కొన్ని క్షీణతలను అనుభవించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మూలధన లాభాల పన్ను పెంచి, ట్రేడింగ్ డెరివేటివ్‌లపై అధిక పన్నులు విధించాలనే నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా నిఫ్టీలో 0.13 శాతం క్షీణత ఏర్పడింది. ఆ క్రమంలో మరిన్ని సూచికలలో కూడా కొంత నష్టాలు చోటుచేసుకున్నాయి. ఇక 2025 బడ్జెట్ నుంచి వచ్చిన నిర్ణయాలు ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు, ఆర్థిక నిపుణులు ఈ బడ్జెట్‌లో కీలక అంశాలపై తమ వ్యూహాలను సెట్ చేస్తారు. ఆ రోజు ట్రేడింగ్ ద్వారా మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున సంపద వచ్చే ఛాన్సుంది.


ఇవి కూడా చదవండి:

Black Budget: 'బ్లాక్ బడ్జెట్' గురించి తెలుసా మీకు.. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..


Maha Kumbh Mela 2025: భక్తులకు అలర్ట్.. మహా కుంభమేళాలో 5 కీలక మార్పులు.


Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..


MahakumbhStampede: మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం కీలక నిర్ణయం..

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 01:42 PM